ఆశ
రేపటి స్వప్నం…
నిన్నటి గతం…
గతించిన కాలానికి ఆయువు…
రాబోవు కాలానికి ఆయుధం…
నిరాశ నిస్పృహలకు చెరమగీతం పాడేది…
ధైర్యానికి పట్టుకొమ్మ…
ఎన్నాళ్ళో వేచిన సమయానికి ముగింపు…
జీవుని జీవాన్ని నిలబెట్టేది…
మానసిక సంఘర్షణలకు నెలవు…
మనిషికీ ఊతం…
నిరాశలను తరిమికొడుతుంది…
జీవితాన్ని నిలబెడుతుంది…
– గోగుల నారాయణ