ఆరడుగుల కోసం ఇన్ని బేధాలా
ఎంత సంపాదించిన…
ఎన్ని పేరు ప్రఖ్యతాలతో తులాతుగిన…
చివరికి ఆరడుగుల నేలను చేరాల్సిందే కదా…
కుల మతాలతో కొట్టుకుంటూ
ఒకరికొకరు దూరమైన…
స్మశాన వాటికలో కలుసుకోవడం తప్పదు కదా…
బిక్షాటన చేసేవాడు ఒలుకుల మిట్ట చేరాక తప్పదు…
బంగారు మంచం పై పవళించేవాడు
అదే ఒలుకుల మిట్టలో నిదురరించక మానడు…
అంత దానికి మనుషుల మధ్య ఇన్ని తేడాలు ఎందుకో…
మనసుల మధ్య ఇన్ని విబేధాలు ఎందుకో…
మన మంతా ఒక్కటే అని ఒక్క
స్వాతంత్ర దినోత్సవం నాడే గుర్తుకు వస్తుందా…
ఆ జాతీయ జెండా లోని మూడు వర్ణలను
చూస్తేనే కులమాత బేధాలు లేవని జ్ఞప్తికి వస్తుందా…
గుడిలో వుండే ధనవంతుడు,గుడి బయట ఉండిపోయే
దరిద్రుడు చేసే ప్రార్ధన ఆ దేవదేవునికి చేరక మానుతుందా…
ఎప్పటికైనా ఆ ఇరువురి ప్రాణాలు ఆ దేవుని
పాదాల చెంతకు చేరవాల్సిందే కదా…
ఇంక ఈ దేహం మీద ప్రేమ ఎందుకు,
జాతులను కించపరచడం ఎందుకు,
వర్ణన్ని చూసి వెక్కిరించడం ఎందుకు…
ఒలుకులు మిట్టలో చేరిపోయే ఈ ఆత్మ
లేని మట్టి శరీరం మీద ఇంత మమకారం ఎందుకు…
-క్రాంతి కుమారి
Avunu nijame chala baaga rasaru
చాలా బాగా చెప్పారు మేడం గారు 👌👌👌👌👌👌
ధన్యవాదములు కళ 🥰🥰🥰