ఆరాటం
మనసంతా కల్లోలమని
సముద్ర తీరాన్ని చేరాను
అలలన్నీ అందాలై ఎగసిపడుతుంటే
గుండె లోలకమై ఊగసాగింది
ఎన్నిదాచుకున్నాడీ సాగరుడు
తనలో తాను ఘర్షిస్తాడు
ఒడ్డును మాత్రం సుతారంగా అలా చేరుతూ అలగా స్పర్శిస్తాడు
ఉదయ సాయంత్రాలలో
మనుషులను చూస్తుంటాడేమో
సంగీతసాధనలో అలలనన్నింటిని సరిగమలు చేస్తాడు
కోపాన్ని ప్రకటించి ముంచుతాడు కదా అనుకుంటాను
దానికెంత మధనపడుంటాడో
గాలి,ఆకాశాల ఒత్తిడికి లొంగిపోయింటాడేమో
తనని చూసినప్పుడల్లా
నా కోపం సిగ్గుపడి పారిపోతుంది
ఎంత మందిని చూస్తుంటాడు
నాలాంటి వాళ్ళని
ఎగసిపడుతూ చిలిపిగా కెరటాలతో నవ్వుతుంటాడు
నా ఆరాటమేదో తీరుతుంది
– సి.యస్.రాంబాబు