ఆనాటి జ్ఞాపకాలు
ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే
నాకే తెలియకుండా నా పెదాలు మీద చిరునవ్వు వస్తుంది..
ఆనాటి గుర్తులు ఎన్నినని చెప్పాలి ఏమని చెప్పాలి
స్నేహితులతో ఆడుకునే ఆటలు
క్లాస్ రూంలో చేసిన అల్లరి
టీచర్ లను వరసలతో పీల్చుకోవడం
ఒకరోజు మేమే టీచర్స్ అయ్యి క్లాసుని చూసుకోవడం
ట్యూషన్ లేకపోతే టీవీ చూడడం
ట్యూషన్ ఉందని తెలిసిన తర్వాత నిరాశకి గురవడం
ప్రతి పండగ రోజు అందంగా తయారయ్యి
ఫ్రెండ్స్ వాళ్ళింటికి వెళ్లడం
ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు తియ్యని వేడుకలు చేసుకునే వాళ్ళం…
ఆ వయసులోనే అన్నిటికి ఆకర్షణ అయ్యి ప్రేమ అనుకునేవాళ్ళం…
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరగడం వల్ల
నాలో ఆ సంఘటన చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది…
కానీ ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి నాకు మాత్రం కన్నీళ్లే వస్తాయి..
చెల్లి , తమ్ముడులతో గడిపిన క్షణాలను గుర్తుకు వచ్చి
చదువు పూర్తి చేసి స్నేహితులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే కారే కన్నీళ్లు గుర్తుకొచ్చిన జ్ఞాపకం…
నా జీవిత గమ్యంలో ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ
కొత్త కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ
ఆ రోజులను ఎప్పటికీ మరవలేనివిగా
జ్ఞాపకాల అలలతో ఈ జీవిత ప్రయాణం ఎంతవరకో…
ఎప్పటికీ మరువలేనిది ఆనాటి జ్ఞాపకాలు అయితే
కొత్తగా జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ ప్రయాణం సాగించడమే కొత్త జీవితానికి నాంది పలికినట్టు..
– మాధవి కాళ్ల