ఆకుపచ్చ ప్రాముఖ్యత
ఆ ప్రకృతి మాత ఆకుపచ్చని వృక్షాలతో నీడనిస్తూ కాయలు పండ్లు పంట పొలాల తో నిండు కుండలా కళ కళలాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వచ్ఛమైన గాలినిస్తుంది. అదే మన ప్రాణావాయువు. ఆ గాలి లేకపోతే మనకు జీవితమే ఉండదు.
మనిషి జీవితానికి ఆకుపచ్చ రంగుకు అవినాభావ సంబంధం ఉంది. ఆకుపచ్చ రంగుకు ఆకర్షించే సుగుణం ఉంటుంది కనుక పండుగలకు శుభకార్యాలలో గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి నూతన వధూవరులకు మొదటగా ఉపయోగించే వస్త్రాల రంగు ఆకుపచ్చ ఈ రంగుతో మొదలుపెడితే… అయస్కాంతముల ఇరు కుటుంబాల మనసులు ఐక్యమై సంబంధం బలపడుతుందని పెద్దల మాట.
నూతన వధూవరుల ఇద్దరి మధ్య ఆకర్షణ తో పాటు వశీకరణ తత్వం ఇమిడిపోయి ప్రేమకు పునాది వేస్తుంది. మన జీవితంలో ఆకుపచ్చ రంగు కలిగిన వస్తువులను ఎక్కువగా వాడతాం. మధురై మీనాక్షి అమ్మవారు ఆమె రూపు రేఖలు వస్త్రాలు చేతిలో ఆకుపచ్చ రంగు చిలకలు మొత్తం ఆకుపచ్చే అంటే అర్థం.
మీనాక్షి తల్లిలో ప్రకృతి మాత అంతర్లీనమై ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ తన సస్యశ్యామలమైన పావన పాద పద్మములను కొలుచుకుంటూ దర్శించుకున్న వారి ఇంట కొంగుబంగారమై అలారారుతూ చిలక పలుకుల వాక్కులు ఇస్తూ వాళ్ల కుటుంబాన్ని పది కాలాలు పచ్చగా ఉంచుతుంది.
ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నా తక్కువే.. అందుకే నేను ఆకుపచ్చ రంగు ఇష్టపడతా ఈ కథ చదివిన వారికి… మధుర మీనాక్షి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు.
– బేతి మాధవి లత