ఆకు + ముళ్ళు = అద్వైత మూడో భాగం

ఆకు+ముల్లు.అద్వైత 3

జగన్ చెప్పింది అంతా విన్న అద్వైత నీరసంగా ఆ గదిలోంచి బయటకు వచ్చింది. జగన్ చెప్పిన ప్రతి మాట ఆమె చెవుల్లో గింగురు అంటున్నాయి. ఛీ లత చెప్పినా వినకుండా నేను వీడి వెనుక వచ్చాను. వీడు ఇంత వెధవ అని తెలియలేదు. అయినా ఒకడిని చూడగానే ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం బయటకు చెబితే దాని ముందు నేను చులకన అవుతాను. కానీ ఎవరికీ చెప్పకుండా నాలోనే ఎలా దోచుకోవాలి. చెప్తే నా పరువు పోతుంది పైగా పెళ్లి కావాల్సిన దాన్ని నా జీవితం బాగుండాలంటే ఎవరికీ చెప్పకుండా ఉండటమే మంచిది.

ముందు జీవితం బాగుండాలంటే ఇవన్నీ మర్చిపోవాలి వెంటనే నా చదువు మానేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బెటర్. అయినా జగన్ అన్న దాంట్లో తప్పు కూడా ఏమీ అనిపించడం లేదు నేను నా సుఖం కోసం వాడి దగ్గరికి వెళ్లి నట్టు అనిపించింది అసలు ఆ సినిమా కి వెళ్ళకుండా ఉంటే ఆ సినిమా లో సీన్లు చూడకుండా ఉంటే నేను వాడి వెనక వెళ్ళేదాన్ని కాదేమో. ఈ వయసులో ప్రేమ కాదు ఆకర్షణ అని లత ఎంత చెప్తున్నా వినకపోవడం నా తప్పు జరిగి పోయింది ఏదో జరిగిపోయింది ఇక నేను చదువు మానేసి వెళ్లిపోతా ఎవర్నో ఒకర్ని పెళ్లి చేసుకొని మీరందరూ నుంచి దూరంగా వెళ్లిపోవాలి. జరిగింది ఒక పీడకలగా మర్చిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నా అద్వైత. తన గదికి వెళ్లి పోయింది.

ఆమె రావడం చూసిన లతా ఏంటి అది ఎందుకు అలా ఉన్నావ్ ఏమైంది అంటూ ఆరా గా అడిగింది మొహం వాడిపోయి దుస్తులను నలిగిపోయే ఉండడంతో అనుమానం వచ్చింది లతకి. ఏదో తనకు ఏదో జరిగిపోయింది అని రూఢీ చేసుకుని ఏంటి ఏమైంది జగన్ ఏమైనా అంటూ మధ్యలోనే వారించి అంత సీన్ లేదు లే అంత పిచ్చిదాన్ని కాదు సినిమా కి వెళ్దాం అదిరిపోయింది అంతే అంటూ తనకు చెప్పకుండా బాత్రూంలోకి వెళ్లి తనివితీర స్నానం చేసి బయటకు వచ్చింది.

ఆ స్థానం చేయడంలో తన ఉన్న బరువంతా తీర్చుకొని కొత్త జీవితానికి నాంది పలకాలని ఉద్దేశం కూడా మిళితమై ఉంది. వచ్చీ రాగానే బాత్ రూమ్ లో దూరిన అద్వైతం చూసి ఆశ్చర్యపోయింది ఈ సమయంలో స్నానం ఏమిటా అనుకుంటూ. బయటకు వచ్చాక అద్వైత తో ఎందుకే స్నానం చేశావు అంటూ అడిగింది ఏం లేదు నాకు డేట్ వచ్చింది అంటూ అబద్ధం చెప్పింది. అదేంటి మొన్ననే కదా వచ్చింది మళ్లీ రావడం ఏంటి అంటూ ఆరాలు తీస్తున్న లతో ఛీ నీకు అన్నీ అనుమానాలే కొందరికి తొందరగానే వస్తుంది కొందరికి లేటుగా వస్తుంది నోరు మూసుకో బట్టలు మార్చుకుని నన్ను డిస్టర్బ్ చేయకు తలనొప్పిగా ఉంది అంటూ నిండా కప్పుకుని పడుకుంది.

వచ్చినప్పటినుంచి అద్వైతం గమనిస్తున్న లతకు మొత్తం విషయం అర్థం అయిపోయింది. దీని పని అయిపోయినట్టుంది అయినా పాపం చెప్పలేక పోతుంది సరే చూద్దాం ఏం జరుగుతుందో అది బయటపడినప్పుడు నేనెందుకు బయటపడాలి నేను ఎందుకు అడగాలి చెప్తే వింటాను లేదంటే లేదు. అయినా మంచి చెడు ఆ మాత్రం తెలియదా మనకెందుకులే అనుకుంటూ తను చదువుకోవడం లో మునిగిపోయింది.
***

ఏమండీ ఎక్కడున్నారు అంటూ పిలిచింది భర్తను శశికళ. ఎక్కడ ఉండడం ఏంటే ఇక్కడే ఉన్నాను ఏంటి చెప్పు అంటూ అడిగాడు మనోహరం గారు. పిల్ల కలలోకి వస్తుంది ఒకసారి రమ్మని ఫోన్ చేయొచ్చు కదా అండి శశికళ.

అబ్బో నీకు మాత్రమే కూతురు మీద ప్రేమ ఉందా అనుకుంటున్నావా నాకు కూడా ఉంది లే నేను అనుకుంటున్నా ఇప్పుడే ఫోన్ చేద్దామని ఇంతలో నువ్వే అన్నావు సరే వెంటనే చేస్తాను అంటూ సెల్ఫోన్ తీసి లతకు ఫోన్ చేశాడు. అద్వైత కు ఫోన్ వాడడం ఇష్టం ఉండదు కాబట్టి ఆమెకి కొన్ని ఇవ్వలేదు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే ఫోన్ చేస్తారు ఇద్దరూ తల్లిదండ్రులు.

హలో హలో అమ్మ లతా బాగున్నావా ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంటూ అడిగింది లత మేము బాగానే ఉన్నాము అమ్మ మా అమ్మాయి బాగుందా అంటూ అడిగాడు బాగుంది అంకుల్ ఏం చేస్తున్నావ్ అమ్మా అంటూ అడిగాడు మనోహరం కాదు మనకి తలనొప్పి ఉంది అంటూ అడిగింది ఒకసారి మాట్లాడాలని ఉంది. అనగానే లత వెళ్లి ఆది మీ నాన్నగారి ఫోన్ నీతో మాట్లాడాలి అంటున్నారు అని అద్వైత నిద్రలేపింది.

అసలే లోలోపల దుఃఖంతో బాధపడుతున్న అద్వైత తండ్రి ఫోన్ అనగానే చటుక్కున లేచి కూర్చుంది. గబుక్కున ఫోన్ తీసుకొని హలో నాన్న అంటూ పిలిచింది. కూతురి గొంతులో దుఃఖం గుర్తించిన మనోహరం గారు ఏంటమ్మా అద్వైత ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ కంగారుగా అడిగాడు. అది అది ఏం లేదు నాన్న అప్పటినుంచి పడుకున్నాను కదా గొంతు పట్టేసి నట్టుంది అంటూ కవర్ చేసుకొని గొంతు సరిచేసుకొని దుఃఖాన్ని దిగమింగి బాగున్నారా నాన్న అంటూ అడిగింది.

మేము బాగున్నాము అమ్మ నువ్వేంటి తేడాగా కనిపిస్తున్నావు అంటూ అడిగాడు ఏం లేదు నాన్న మీకు అలా అనిపిస్తుంది అంతే అని అద్వైత అనగానే కూతురు ఉంది అని అనిపించింది దాంతో వెంటనే మనోహరం గారు అమ్మ అమ్మ నిన్ను చూడాలని అంటుంది ఒకసారి ఇంటికి రాగలవా అంటూ అడిగాడు. ఇప్పుడు పరీక్షలు నా కదా నాన్న ఇప్పుడు ఎలా రావడం అంటూ అంది.

ఈ పరీక్షలు ముఖ్యమైనవి కాదు కదా అమ్మ ఒకసారి వచ్చి వెళ్ళు తర్వాత అయినా రాసుకోవచ్చు అంటూ మనోహరంగా తన కూతురి మనసు గుర్తించి అన్నారు. అద్వైత కూడా మనసులో ఎప్పుడెప్పుడు వెళ్లి తండ్రి ఒడిలో వాలి కరువుతీరా ఏడవాలని ఉండడంతో అలాగే నాన్న ఇప్పుడే బయలుదేరుతున్న అంటూ ఫోన్ లత చేతికి ఇచ్చింది. అమ్మ లత దగ్గరున్న ని అద్వైత బస్సెక్కిచ్చు అలాగే నువ్వు కూడా రావాలి అనుకుంటే వచ్చెయ్ అన్నారు మనోహరం గారు నేను రాలేను. పరీక్షలు ఉన్నాయి అందుకే అద్వైత ను మాత్రం బస్సు ఎక్కిస్తాను అంది లత. సరే అమ్మ ఉంటాను. అంటూ ఫోన్ పెట్టేసాడు మనోహరం గారు.

తండ్రి ఫోన్ చేయడంతో తన చదువు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అందుకోసం చివరిసారిగా ఒకసారి జగన్ ని కలవాలనీ ఆ వీడియో డిలీట్ చేయించాలని అనుకున్నదే తడవుగా గబుక్కున లేచి తయారైపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు అంటున్న తన మాటలను పట్టించుకోకుండ నేను ఇప్పుడే వస్తాను అంతలోపు నా బట్టలు పుస్తకాలు అన్నీ సర్ది అంటూ చెప్పి చెప్పులు వేసుకుని గబగబా బయటకి వెళ్ళిపోయింది.

అద్వైత ఎందుకు అలా హడావుడిగా బయటకు వెళ్లి పోతుందో అర్థం గాని లత ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయింది.

ఇంతకీ అద్వైత జగన్ ని కలిసిందా ? లేదా ? జగన్ ఆమె కోరికని మన్నించాడా ? లేదా ? నెట్ లో ఆమె వీడియో రాకుండా తనను తాను అద్వైత కాపాడుకుందా ?  లేదా ? అనేది మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం..

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *