ఆకాశ రాజు
మనసు గవాక్షాలు తెరిచి..
నీ కోసం వేచి ఉన్నా!
ఎప్పుడో నా మనసులోకి..
దూరిన నీవు చేసే చిలిపి..
అల్లరులకు నా మనసు..
నీ కోసం ఆరాట పడింది..
నీవేమెా నన్ను అర్థం చేసుకోవూ..
నీ మనసు గావాక్షాలు తెరువవు..
నా కోసం తెరిచి ఉంచచ్చు కదా..
నీ కోసం నేనెప్పుడూ తెరిచే ఉంచా..
కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసా..
అయినా నువ్వేమెా రావు…
ఆకాశ రాజు కు నా ఆవేదన చెప్పా..
నేలమ్మ తల్లీ ఇంతింత చెవులేసుకుని..
విన్నది..
ఆ రాజేమెా తన దగ్గరున్న కన్నీళ్లన్నీ..
ఇచ్చేసాడు నా కోసం..
భదేవి మాతేమెా ఆ కన్నీళ్లను..
మెాయలేక కుంగి పోతుంది..
నా బాధ చూసి..
అయినా నువ్వు మాత్రం రావే!
నా మనసు గవాక్షాలు మాత్రం..
తేరిచే ఉన్నాయి నీ కోసం!!
-ఉమాదేవి ఎర్రం