ఆహారపు అలవాట్లు
ఆహారమే ఔషధం అంటారు. రాజులా తినాలి బంటులా కష్టపడాలి అంటారు. ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం అతిముఖ్యం. సమతుల ఆహారం అనేది శరీర క్రియలను సమతుల్య పరుస్తుంది. మంచి ఆహారపు అలవాట్లు జీవనశైలిపై ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో అయితే రసాయనాలు లేని పంట చేసే పనిలోనే వ్యాయామం ఉండేది.
నేటి యాంత్రిక జీవనంలో పోషకాహార లోపం వలన అనేక రకాలైన జబ్బులు రావడానికి కారణం అన్ని రకాల ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆరోగ్యానికి మంచి ఆహారపలవాట్లు ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం మానసిక వికాసానికి తోడ్పడతాయి.
ప్రస్తుత ఆహారపు అలవాట్లు శరీరంపై దుష్ప్రభావం చూపుతున్నాయి ఆహారం శరీర పోషణకు మాత్రమే కానీ రుచికరమైన ఆహారం వ్యసరంగా మారిపోయింది. శరీరానికి తక్కువ శ్రమ, మనసుకు ఎక్కువ శ్రమ అనే విధంగా మారిపోయియి రోజులు మనకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని మితంగా భుజిస్తూ క్రమబద్ధమైన జీవనశైలితో మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యసిరిని సొంతం చేసుకోవచ్చు……
– జి జయ