ఆగిన ప్రజా గొంతుక
నేల రాలింది ఓవిప్లవ తార… పొడుస్తున్న పొద్దుమసక బారె
నడుస్తున్న కాలమోక్షణమాగె!
ఒక విప్లవ గొంతుక మూగ
పోయింది
ఒక విప్లవవీరుని ఆటపాట
ఆగింది
జన నాట్య మండలి గజ్జెల
సవ్వడాగింది
కారంచేడు దళితులకండై
నిలిచిననడకాగింది
‘గధర్ పార్టీ’గుర్తునే మీపేరై
శాశ్వతంగానిలచింది
జైబోలోతెలంగాణచిత్రంలో
యాదగిరివై పాడిన
బండెనక బండి పదహారు
బండ్లు నీవే కట్టింది
ఉద్యమాల బాటకుపునాది
రాయివి
హేతువాద ఉత్తరాంధ్ర గద్దరై
వంగపండుగనిలిచావు
తెలంగాణ ఉద్యమాల్లో కీలక
పాత్ర,సూత్ర దారివైనావు
బుర్రకథ, ఎల్లమ్మ కథలెన్నెన్నో
అల్లేసి ఊరూరు గళమెత్తి
వేలకొలదిగాయకులకుసంగీత
దళత సరిగమలు నేర్పావు
ఓ విప్లవ జ్యోతి ఆరింది
ఓవిప్లవ గేయమాగింది
ఓఎర్రజెండనృత్యమాగింది
ఐనాపొడుస్తున్నపొద్దుమీద
నడుస్తూ వస్తాడు గద్దర్ అన్న
విప్లవ కొత్తగేయాలు రాస్తాడు.
జోహార్ గద్దర్ అన్న..
-గురువర్థన్ రెడ్డి
Bagundhi.
కానీ పదానికి పదానికి కొంచం స్పాస్ ఇవ్వాలి..