ఆదేశం

ఆదేశం

 

తవ్వినకొద్దీ ఉబికివచ్చే
నీటి ఊటల్లాగా
నిరంతరాయంగా బాధించే సంవేదనల ఊబి నుంచి
పునాదులతో సహా
పెకిలించుకొని
మధురాగాల తీరాన్ని
చేరాలనే నా హృదయం
తాలూకు అంతర్మధనపు భాష ఆలకించాడేమో
ఆ అవనీ ప్రదాత!
ఉపరితలం నుంచి సరాసరి గగనంలోకి విజృంభించే

ప్రళయనాధాల నీలిసంద్రపు ఉపరితల ఆవర్తనంలో అధ్యంతాలు లేకుండ
నిలకడలేని అలలలో
నిర్జీవ కణంగా
పరిభ్రమించమని ఆదేశించాడు!

 

-మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *