ఆదరణతో అందరివాడివై…!!!
వ్యక్తంగాని సంవేదనల వెనుకన
నిజాల నిష్పక్షపాతాన్ని కల్పనగా
భావించకు…పోటెరుగని నిరంతరం నీకు
పోరాటం కారాదు జీవితం తెలవారుటతో
మొదలు కదిలే వాస్తవాలుగా సంధ్యలు
పంపిన సందేశాలతో రేపటికి సత్కారమని
తెలుసుకో…
వాదోప వాదాలతో తేలని విషయంగా
వ్యక్తిత్వాన్ని అణిచివేయబడుతు…
ఎదలోతుల్లో పొరలిన దుఃఖపు వెల్లువతో
విధి చేతనలు వక్రించిన శాపాలని…
శూన్యం చెప్పిన వింత కథలకు ఆత్మగా
కదలుతు కర్మలు విలక్షణ ఉదృతాలని
కరుణ జూపని విశ్వాసాలను కాఠిణ్యంగా
తూర్పార బోయకు…
అనాదలు అభాగ్యులున్న సంఘంలో
మొలచిన మొలకవని దిగులు చెందకు…
గుండె స్పందనలకు సమాధానమవుతు…
గుబులు గారఢీని ఊభి కుంటన సమాధి
చేయి…కోరల కంటిన రక్తపు రుచులతో
విరుచుకు పడుతున్న ధనవంతుల
అకృత్యాలను నిలువని జాడలతో
పాతాళానికి విసరివేయి…
ఆశలను పూయకు చేయి చేసిన ఆధరణతో
అందరి వాడివై…
ఆప్యాయతలను అన్నపు ముద్దలుగా
కలుపుతు… ఆకలన్న పేదవాడికి కడుపులు
నింపుతు నిర్వచనానికి సుడిగుండాలు
సూత్రం కాలేవు…మనస్సు చేసిన వేడుకలని
బాసటగా దొరికిన తోడుతో బడలిక బంధమై
సాగిపోయే ఆనందాన్ని పంచుకో…
– దేరంగుల భైరవ