ఆడపిల్ల
చదువులో వెనక పడిన తన కూతురికి తన తల్లి చెపింది ఓ మాట..
నా బంగారు తల్లి నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి అనీ..
అలాగే ఆ కూతురు బాగా చదువు కొని ప్రథమ స్థానంలో నిలబడింది..
ఆ తల్లీదండ్రుల ఆనందానికి అవధులు లేవు ఆ క్షణాన..
ఆ ఆడపిల్లకూ వయసు పెరిగే కొద్దీ భయం అల్లుకుంది ఆ తల్లిదండ్రులకూ..
ఇంకా నిన్నూ చదివించలేము నా బంగారు తల్లీ ఇంటిపట్టున ఉండి అమ్మకు సాయంగా ఉండు అని తన తండ్రి మాటలలకు తల్లడింది ఆ పసి హృదయం..
ఎందుకు నాన్న ఎందుకు నన్ను చదివించరు నేనూ బాగానే చదువుకుంటున్న కదా అనీ ఆ అమ్మాయి తన తల్లిదండ్రులనూ ప్రశ్నించగా..
ఆ తల్లిదండ్రుల సమాధానం ఏంటో తెలుసా నీవూ బాగా చదువుకొని గొప్ప విద్యా వంతురాలివి అయితే అంత కన్న చదువుకున్న అబ్బాయిని తెచ్చి నీకూ పెళ్లి చేసే స్తోమత మాకు లేదు అని..
సరస్వతి కటాక్షం ఉన్నా ఉన్నత చదువులు నోచుకోని ఆడబిడ్డలు ఎందరో నేడు వంటింట్లో మకుటం లేని మహారాణిలు అయ్యి వంటింటి రాజ్యం యేలుతున్నారు..
ఆ ఆడబిడ్డ బ్రతుకు ఇక వంటింటికే పరిమితం అవ్వాల్సిందేనా…? అలా అయినా ఆడపిల్లల బ్రతుకులు ఎన్నో..
బ్రతుకు దారి మొత్తం పోపులు డబ్బాలు… పప్పు దినుసులే..
– కళ
నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కధ సమాజాన్ని ఆలోచింపజేస్తుంది