ఆడపిల్ల
ఆడపిల్ల అంటే అడవిలో మాను కాదు ఆడపిల్ల అంటే అద్వితీయమైన శక్తి అన్నారు
ఆడపిల్ల అంటే అపురూపం
ఆడపిల్ల ఉంటే అదృష్టం
ఆడపిల్ల అంటే అందం
ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి
ఆడపిల్ల ఉంటే ప్రేమాభిమానాలపెన్నిధి
మమతల నిండిన మనసు
ఇవన్నీ ఇంటి వరకు సహజమే కానీ….?
మారుతున్న సంస్కృతి సంప్రదాయాలు
సమాజంలో చిట్టి తల్లులకు చిన్నచూపే
ఆంక్షలు అంతరాలు
సమానత్వం లేని స్వేచ్ఛ
ఎన్నో ఎదురు సవాళ్లు
అవరోధాల మార్గం
కరువైన రక్షణ
అర్థం లేని అపోహలు
అన్నీ కలిపి ప్రశ్నార్ధకమవుతున్న ఆడపిల్లల జీవితం
నేటి సమాజపు మార్పునకనుగుణంగా ఆడపిల్లలను తీర్చిదిద్దాలి
అది అందరి బాధ్యత
అసమానతలకు తావు లేకుండా
బాలికలకు భరోసానిచ్చి
సమానత్వపు సౌధాన్ని ఎక్కించాలి
బేటి బచావో బేటి పడావో
అనే నినాదం సమిష్టికృషితో సాధ్యం మరి….
– జి జయ