ఆడాళ్ళు మీకు జోహార్లు
ఆడపిల్ల అని అన్నింటా ఆంక్షలు విధించిందినా
కని పెంచిన పాసానికి బంధీగా బతుకుతున్న
ఆడాళ్ళు మీకు జోహార్లు…
ఏ తప్పూ చేయకుండా వివాహ ఖైదీగా
మెట్టినింటి జైలులోకి అన్యాయంగా నెట్టబడినా
నవ్వుతో బాధని దాచే ఆడాళ్ళు మీకు జోహార్లు…
పదిహేనేళ్లగా కష్టపడిన చదువుకి లంచం ఇచ్చి మరీ కోడలి ఉద్యోగం అంటగట్టినా జీతంగా బానిసత్వాన్ని తీసుకుంటూ
ఉనికినే త్యాగం చేసే ఆడవాళ్ళు మీకు జోహార్లు…
కుటుంబాన్ని నడుపుతూ మీ అభివృద్ధికి అడ్డోచ్చే కుటిల మనస్తత్వాలను మసి చేస్తూ పట్టువిడవకుండా పోరాడుతూ
కలల ప్రపంచాన్ని పాలిస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు…
– రమ్య పాలెపు