ఆడ బ్రతుకు

ఆడ బ్రతుకు

ఆడదానిగా పుట్టిన పాపానికి…

చిన్నప్పటి నుండి కష్టాలు మొదలు అది చిన్నదా, పెద్దదా అని చూడకుండా ఆ గిన్నె తే పో, ఈ గిన్నె పెట్టు అంటూ ఎన్నో మాటలు చెప్తూ,ఆడదానివి   ఆ మాత్రం నేర్చుకొకపోతే ఎలా అంటూ అప్పటి నుండే అత్తగారి ఇల్లు అని నూరి పోస్తూ,

వాళ్ళు అనే మాటలు ఎలా ఉంటాయో చెప్తూ ,పావుగంట అయినా సుఖంగా నిదురపోనివ్వక, అన్ని పనులు వచ్చాక ఇంటి బాధ్యతను అప్పగించి చూస్తూ,

చదివిన చదువు చాల్లే ఎంత చదివినా చేట లో బియ్యం ఎరాల్సిందే కదా అని ఎద్దేవా చేస్తూ , వారికి ఉన్న దాంట్లో ఏదో ఇచ్చి గంతకు తగ్గ బొంత అని ఒకన్ని చూపిస్తే, తమకు ఇష్టం లేక పోయినా, పెళ్లి వద్దు అంటున్నా, కూడా సమాజం లో తల్లిదండ్రుల పరువు పోవద్దు అని,

తల దించుకుని ఎవరో తెలియని వ్యక్తి కి తనను తాను అర్పించుకుంటుంది ఆడది. ఆడ పిల్ల అడ పిల్ల నే అని గ్రహించి ఇదే నా ఇల్లు అనుకుంటూ వాడి చేతిలో తన బంగారు భవిష్యత్తును , శరీరాన్ని అప్పగించి ఊరుకుంటుంది .

మంచి అయినా, చెడు అయినా భరిస్తుంది. పుట్టిన పిల్లల కోసం మొగుడు పెట్టే హింస ను సహిస్తూ తాను తిన్నా, తినక పోయినా పిల్లలను పెంచుతుంది.

చివరికి పిల్లలకు రెక్కలు వచ్చాక పంచుకుంటే ఆనందంగా చూస్తుంది. పంపకం లో భాగంగా ఎక్కడ ఉండాల్సి వచ్చినా అక్కడే ఒదిగి పోతుంది. తాను తన పిల్లలకు భారం అయినా నాడు తన ప్రాణాలు సైతం తీసుకోవడానికి సిద్ధ పడుతుంది ఆడది.

ఇలా ప్రతి అడుగు లోనూ తన కoటూ కాకుండా తన చుట్టూ ఉన్న వారికి వెలుగు కోసం తనను తాను ఆర్పించుకుంటుంది ఆడది.

ఆడదానికి ఎన్నో కబుర్లు చెప్పే మగాడు మాత్రం, ఆమె నీ క్షణం క్షణం హింసిస్తూ ,నరకం చూపిస్తూ ఆనందిస్తాడు.

 

ఇంత చేసినా తనకంటూ ఒక గుర్తింపు లేని చావు చస్తుంది ఆడది. తన ఇంటికి తాను మహారాణి అనుకుంటుంది పాపం దానికేం తెలుసు అది వెలుగున్నంత సేపు వెలుగు ఇచ్చే లైటు పురుగు అని ..దాని బతుకు మున్నాళ్ళ ముచ్చటే అని…

 

-భవ్యచారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *