ఆసేతు హిమాచలం వరకు

ఆసేతు హిమాచలం వరకు

పంచమ వేదాలతో నిండర్థాలను
తడుపుకొని తానొక వర్ణన కాదని…

మధురఘట్టాల ఇతిహాసాలు మన్ననలై
నిజాల నిర్భయత్వాన్ని గ్రహింపచేస్తు
తానొక స్వేచ్ఛకు రక్షణగా నిలబడి…

స్వార్థం నింపని పూర్ణీభావాలకు పున్నమి
వెలుగులతో సాక్ష్యం పలుకుతున్నది…

మేళవింపుల ఆస్థానాలతో గర్వపడక
ఆవేశాల ఆజ్ఞాను సారాలతో వెలితిబడక
నిత్యం నూతన వసంతమని తన రూపాన్ని
మానసిక స్పర్శలతో మొలిపిస్తు…

దర్పణం నడిచే తేజమై ఇద్దరి మనస్సుల
ఆదరణలకు కట్టుకొన్న బంధాల
ఆవిష్కరణయే రక్షాబంధన్…

కల్లోలం కాని ఎల్లలు ప్రపంచానికి
దిశా నిర్దేశాలుగా కనబడుతున్నాయి…
విశ్వమానవ కోటికి ఆదర్శభావాలతో
ఆస్తికత్వాన్ని నింపుతు…

నింగి ఎరిగిన సత్యానికి నిదర్శణమై
ఉదయించే భావాలతో…
స్పూర్తి దాయకమై గతాన్ని మరువక
నేటి తరానికి నిజమై నడిపిస్తున్నది…

ప్రయత్నాలను చిరునవ్వులతో పుష్పిస్తు
కదిలే బంధాలు విడిపోని మనస్సుకు
కనువిప్పవుతు…

చూపిన త్యాగాన్ని పూచే లతల పరిమళాలతో విరబూయిస్తు…
ఆ గుణాల కలయిక అంతటితో ఆగరాదని
అక్కా చెల్లెళ్ళు చేసే ఆరోగ్యకరమైన సందడే
రక్షాబంధన్…

కులమతాల వైషమ్యాలతో భేధాన్ని
చూపని విస్తృత వ్యాపకంతో సాహసపు
ఆప్యాయతలకు మందిరమై…

పూజలందుకొనే దేవుళ్ళుగా అన్నదమ్ముల
అనుబంధాన్ని పది కాలాల పచ్చధనాలతో
వర్ధిల్లాలని దీవిస్తున్న లాలింపే రక్షాబంధన్…

రుగ్మతలు లేని దర్శణం ఏకత్వమై…
దిశ నలుమూలలతో ఆసేతు హిమాచలం
వరకు రక్షించబడాలని…

పూనుకొన్న ఐక్యతతో మనుషులమై
భావన చేసిన వెచ్ఛధనాలను బంధిస్తు…
దేశాన్ని రక్షించుటలో సైనికులమై
ప్రగతిపథాన్ని రక్షించుకోవాలన్నదే రక్షాబంధన్.‌‌..

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *