తొందరపాటు నిర్ణయాలు
జ్ఞానేశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
తన ఫ్రెండు తేజస్విని వచ్చి ,
“ఏంటే ఎప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడేమో బాధగా ఉండడం ఇవన్నీ నీకు అవసరమా” అని అడిగింది.
“అది కాదే తేజు నేను ఎన్నిసార్లు ఆలోచించినా మాకు ఆ మార్గమే కనిపించింది. అందుకే అది చేయాల్సి వచ్చింది” అని దిగులుగా సమాధానం ఇచ్చింది జ్ఞానేశ్వరి.
సరే ఇప్పుడు ఇంట్లో నీ పరిస్థితి ఏంటి అని అడిగింది తేజస్విని.
“అందరూ తిట్టడం మొదలుపెట్టారు కానీ , తాతయ్య మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. అదే ఇంకా బాధగా అనిపిస్తుంది నాకు” అని చెప్పింది జ్ఞానేశ్వరి.
“తాతయ్య ఎందుకు నవ్వారో నువ్వు వెళ్లి అడగలేక పోయావా?” అని చెప్పింది తేజస్విని.
“అది అడగడం సందర్భం కాదు” అని మౌనంగా ఉన్నాను అని చెప్పింది జ్ఞానేశ్వరి.
“ఇలాంటివి మాత్రం బాగా చెప్తావ్. ముందు అయితే తాతయ్య ఎందుకు నవ్వారు తెలుసుకో? ముందు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకో. అందుకే అందరి దగ్గర నువ్వు చులకన అయిపోతున్నావు అది తెలుసుకో” అని చెప్పి వెళ్ళిపోయింది తేజస్విని.
‘తేజస్విని అన్నమాట కూడా నిజమే నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నా నిర్ణయాలు తప్పు అవుతున్నాయి. దాని ద్వారా సమస్యల్లో నేను చిక్కుకుంటున్నాను. వెంటనే తాతయ్యని అడగాలి అనుకొని’ వెంటనే ఇంటికి బయలుదేరింది జ్ఞానేశ్వరి.
“తాతయ్య… తాతయ్య… ఎక్కడున్నారు?” అని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతుంది జ్ఞానేశ్వరి.
“తాతయ్య ఈ టైంలో ఇంట్లో ఉండరు అని నీకు తెలుసు కదా. ఆయన వాకింగ్ కి వెళ్లారు. ఆయన ఇంటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది” అని చెప్పింది సునంద.
“అవును కాదు మర్చిపోయాను” బ్యాగ్ ని సోఫాలో పెట్టేసి వెంటనే వాళ్ళ తాతయ్య దగ్గరికి బయలుదేరింది జ్ఞానేశ్వరి.
“ఒసేయ్… జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్తున్నావ్ ఇప్పుడు?” అని అరుస్తుంది సునంద.
“నేను వెంటనే తాతయ్య తో మాట్లాడాలి. అందుకే తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయింది జ్ఞానేశ్వరి.
రఘురామయ్యని వెతుక్కుంటూ పార్క్ మొత్తం తిరుగుతుంది జ్ఞానేశ్వరి.
ఒకచోట ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు రఘురామయ్య.
వెంటనే పరిగెత్తుకొని రఘురామయ్య దగ్గరికి వెళ్ళింది జ్ఞానేశ్వరి.
ఆయాస పడుతూ అక్కడ ఉన్న బెంచి మీద కూర్చుంది.
తనతో తెచ్చుకున్న వాటర్ ని జ్ఞానేశ్వరి కి ఇచ్చాడు రఘురామయ్య.
“సరే మీరు వెళ్ళండి. మీతో తర్వాత మాట్లాడదాం” అని చెప్పి తనతో ఉన్న తన ఫ్రెండ్స్ ని వెళ్ళిపోమని చెప్పాడు రఘురామయ్య.
నీళ్లు తాగి “తాతయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి. అందుకే వచ్చాను” అని చెప్పింది జ్ఞానేశ్వరి.
“అవునా… జ్ఞానం చెప్పు ఏం చెప్పాలి?”అని అడిగాడు రఘురామయ్య.
“తాతయ్య నేను ఆ తప్పు చేశానని ఇంట్లో తెలియగానే , మీరు ఎందుకు నవ్వారు?” అని అడిగింది జ్ఞానేశ్వరి.
ఆ విషయం తెలుసుకుని నవ్వుతూ ,
“ఎందుకంటే నాకు ఒక చిన్న పిట్ట కథ జ్ఞాపకం వచ్చింది. అది ఏంటో తెలుసా జ్ఞానం? చెప్తాను విను.
ఒక అడవిలో కాకి , కోయిలలు మంచి స్నేహితులు.
ప్రతిరోజు ఉదయం సాయంత్రం కోకిల తన సందర్భాన్ని బట్టి కూసేది.
ఒకరోజు అడవిలోకి వేటగాడు వచ్చాడు. తొందర పడ్డ కోకిల కూసింది.
వెంటనే వేటగాడు వలలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది.
కాకి తన కూయకుండా ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వినిపించుకోకుండా కూసి తన ప్రాణాలు పోగొట్టుకుని కోకిల.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనమే చిక్కుల్లో పడతాము.
తొందరపడి కూసిన కోయిల వేటగాడు చేతిలో ప్రాణం కోల్పోయింది.
ఇప్పుడు అర్థమైందా నేను అప్పుడు ఎందుకు నవ్వానో? చూడు పండు కి నువ్వు తనకు రాని సబ్జెక్టు గురించి చెప్పాలనుకున్నావు.
నీవు అంత ప్రయత్నం చేసావ్ కానీ ఆ ఎగ్జామ్ లో వాడు ఫెయిల్ అవ్వడం నీ తప్పు కాదు. వాడు సరిగ్గా చదవకపోవడమే వాడు తప్పు. దాంతోపాటు నీ తప్పు కూడా ఉందని నీ మీద నింద వేయడం వాడు తప్పుంది.
అది తెలుసుకొని ఎవరికి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయకూడదు తెలుసుకుంటే మంచిది.
నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కూడా తప్పే.
ఒకసారి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నీ ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ కి వెళ్లావు గుర్తుందా? ఆరోజు నీ ఫోన్ స్విచాఫ్ కూడా అయింది. ఇంటికి వచ్చినప్పుడు రాత్రి 12 గంటలు అయింది. ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డామని నీకు అర్థమైందా ఇలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకొని సమస్యలు చెప్పుకోకు” అని చెప్పారు రఘురామయ్య.
“నన్ను క్షమించండి తాతయ్య. ఇంకెప్పుడూ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోను” అని చెప్పి బాధపడింది జ్ఞానేశ్వరి.
“నీకు ఆలోచన వస్తే అది మాతో పంచుకో అది కరెక్ట్ కాదు మేము చెప్తాం” అని చెప్పారు రఘురామయ్య.
“అలాగే తాతయ్య. పదండి ఇంకా ఇంటికి వెళ్దాం” అని చెప్పి ఇంటికి వెళ్లారు.
మాధవి కాళ్ల