కాలమే సమాధానం చెప్పుతుంది

కాలమే సమాధానం చెప్పుతుంది

“దామిని… ఈరోజు సాయంత్రం  మా అన్నయ్య వస్తున్నాడు” అని చెప్పాడు నందన్.
“అలాగే అండి…” అని చెప్పి  బాబుకి పాలు ఇస్తుంది దామిని.
నందన్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. సాయంత్రం రాజీవ్ వచ్చాడు.“అన్నయ్య… ఎలా ఉన్నావ్? వదిన పాప బాగున్నారా?” అని అడిగాడు నందన్.
“బాగున్నారా బావ గారు? అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? పాప స్కూల్ కి వెళుతుందా?” అని అడిగింది దామిని.
ఇలా కుశల ప్రశ్నలయ్యాక రాజీవ్ స్నానం చేయడానికి వెళ్ళాడు.దామిని టిఫిన్ చేసి , రాజీవ్ , నందన్ లకు టిఫిన్ పెట్టి దామిని తినడానికి కూర్చున్న సమయంలో బాబు ఏడవడం మొదలు పెట్టాడు.వెంటనే రూమ్ లోకి వెళ్లి బాబుని తీసుకొని ఇల్లు మొత్తం తిరుగుతుంది.

వీళ్ళ ఇద్దరు తిని బయటకు వెళ్ళారు.దామిని , నందన్ ల పెళ్లి అయ్యి సంవత్సరమయ్యింది. ఈ మధ్యనే బాబు పుట్టాడు. దామిని వాళ్ళ అమ్మతో ఒక గొడవ జరగడం వల్ల అది చిలికి చిలికి గాలి వానగా మారి ఇప్పుడు తుఫానుగా మారింది.

ఒక ఇల్లు గురించి ఇరు కుటుంబాల మధ్య వాదన జరిగింది. దాంతో నందన్ దామిని వాళ్ళ అమ్మ వాళ్లతో సరిగ్గా మాట్లాడాడు.  నందన్ కి తెలియకుండా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంది.
చిన్న బాబుని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. నందన్ ఇంటి పనుల్లో సహాయం చేసి జరిగిన గొడవ గురించి ప్రతిసారి దామిని తిడుతూనే ఉంటాడు.

ఒకరోజు ఉండి వెళ్ళిపోయాడు రాజీవ్.రెండు రోజులు తరవాత దామిని అమ్మ ,నాన్నలు వచ్చారు. నందన్ ఆఫీస్ లో ఉండడం వల్ల ఫోన్ చేసి చెప్పింది.
“ఎందుకు… మీ వాళ్లు ఇంటికి వచ్చారు? వచ్చేముందు నీకు మీ నాన్న ఫోన్ చేయలేదా?”అని అడిగాడు నందన్.
“నాకు మా నాన్న ఫోన్ చేయలేదు. వాళ్లు సడన్గా వచ్చారు” అని చెప్పింది దామిని.ఇలా ఏదో ఒక గొడవ వీళ్ళ మధ్య జరుగుతూనే ఉంది. బైక్ కీ బైక్ కి పెట్టి వదిలేసి ఇల్లు మొత్తం వెతికాడు నందన్.

అప్పటికి దామిని చెపుతూనే ఉంది. బైక్ కీ బైక్ కి పెట్టి ఉంటావు వెళ్లి చూడు అని చెప్పిన వినకుండా బీరువాలో ఉన్న బట్టలు అన్ని చండాలంగా చేసాడు.  బాబుని నిద్రపుచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది.

ఒక వారం రోజుల మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు అని చెప్పి వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్ళాడు నందన్.
రెండు రోజులు గడించిన తర్వాత  దామిని నందన్ కి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. జీతం వచ్చిందా? అని అడిగింది దామిని.

జీతం వచ్చిన ప్రతిసారి దామినికి చెప్పాడు. ఈ నెల జీతం రాలేదు అని అబద్ధం చెప్పాడు నందన్.
తను మెసేజెస్ చేసినవన్నీ డిలీట్ చెయ్యడం, నందన్ ఫోన్ దామిని పేరు మార్చడం దామిని కోపంగా మాట్లాడిన తర్వాత బాధపడేది.

అయ్యో అనవసరంగా కోప్పడ్డానే అనుకునేది.అయినా సరే నా బాధ అర్థం చేసుకోవడం లేదు.నీకే మనసు ఉందా? నీకు కోపం వస్తే మాత్రం ఇంట్లో ఉన్న వస్తువులను పగలకొట్టి బయటకు వెళ్లిపోతావు.

మరి నాకు కోపం రాదా? నువ్వు పగలకొట్టితే నేను ఇల్లు శుభ్రం చేయాలి. నేను ఒంటరిగా బాధ పడ్డాలి.
నన్ను దారిలో ఉన్న ఎండమావిగా మిలిగిపోయాను. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అని బాధపడుతూ ఉంది దామిని.

అటు కన్నా వాళ్ళకి సపోర్ట్ చేయలేక ఇటు అత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ ఏదో గడిపేస్తుంది జీవితం అని అనుకుంటూ ఉండగా బాబు నిద్ర లేచి ఏడిస్తే ఆడిస్తుంది దామిని.

భార్య ఊరికే గొడవ చేస్తుందా? అని మగవాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి కారణమా అనేది దొరకట్లేదా? భార్య ఆవేదనలను చెప్పుకోవడం కూడా తప్పేనా అనే దానికోసం కాలమే సమాధానం చెప్తుంది అని

నమ్మకంతో తన రొటీన్ జీవితంలో మునిగిపోయింది దామిని.కొన్ని సమాధానాలు వెంటనే దొరికిన కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పుతుంది.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *