హృదయం లేని మనిషి
ఆకలితో ఉన్న వాడికి పట్టెడన్నం పెట్టలేని వారు
కన్నీరు కార్చిన వారికి కన్నీరు తుడవని వారు
ఒకరి బాధనే ఒకరు పంచుకొని వారు
తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నవారు
ఆడపిల్లలకు విలువని ఇవ్వనివారు
హక్కులు ఉల్లంఘించిన వారు
తల్లిని గౌరవించని వారు
తల్లిదండ్రుల అనాధ శరణాలకి పంపినవారు
అబద్దాలు తరచూ మాట్లాడేవారు
మోసం చేసినవారు
యుద్ధంలో అదే పనిగా చేస్తూ నడిచేవారు
ఇతరుల హాని తలపెట్టేవారు
కుటుంబాలు లెక్క చేయని వారు
కష్టం వస్తే ఏడవని వారు
ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత వచ్చినది మానవజన్మ
అట్టి జన్మను సార్ధకం చేసుకోకపోతే మనుషులు కారు
వారు మనుషులు కారు మరమనుసులు
వారు మనుషులు కారు
దుష్టులు
వారు మనుషులు కాదు హృదయం లేని వారు
– యడ్ల శ్రీనివాసరావు