గువ్వల జంట
ఒక పెద్ద చెట్టు పైన చిన్న గూడుకట్టుకుని ఒక గువ్వల జంటనివసిస్తోంది. అవి అక్కడఆనందంగా ఉన్న సమయంలోఒక రోజు పెద్ద వాన కురిసింది.గాలి కూడా వీచింది. గువ్వలురెండూ సురక్షిత ప్రాంతానికి ఎగిరి పోయాయి.
ఒక పాత భవనం లోపలికి వెళ్ళాయి. అక్కడ ఎవరూ లేరు. వాన తగ్గాక తాము గూడు కట్టుకున్నచెట్టు వద్దకు వెళ్ళాయి. అక్కడవెళ్ళి, అక్కడ ఉన్న పరిస్థితి చూసాక ఆ గువ్వలు గజగజ వణికాయి. ఎందుకంటే అక్కడ ఉండే చెట్టు కూలిపోయింది.
చెట్టే లేకపోతే గూడుఎక్కడ ఉంటుంది. గువ్వలురెండూ బాధపడ్డాయి. ఇప్పుడు మళ్ళీగూడు కట్టుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వాటికి ఏమి చేయాలో పాలుపోలేదు.
అవి భగవంతునితో” ఓ భగవంతుడా,మేముచాలా చిన్న గువ్వలం. మేము కష్టపడి కట్టుకున్న గూడు నాశనం అయిపోయింది.మళ్ళీ గూడు కట్టుకునే శక్తి లేదు.
త్వరలో గుడ్లు పెట్టి, ఆ గుడ్లను పొదిగేందుకుఒక గూడు కావాలి” అని అడిగాయి.అప్పుడు భగవంతుడు”
మీ అవసరమే మిమ్మల్ని మళ్ళీ గూడు కట్టుకునేలా చేస్తుంది. గాలి వాన రావటం ప్రకృతి
సహజం. చెట్లు పడేది కూడా ప్రకృతి సహజమే.
మీరు మళ్ళీ గూడు కట్టుకోగలరు. మీకు ఆ శక్తి ఉంది. నిరాశ పడకండి. చక్కటి గూడు కట్టుకుని హాయిగా ఉండండి” అన్నాడు.
గువ్వలు రెండూ మళ్ళీ గూడును కట్టుకునేందుకు సిద్ధమయ్యాయి.గువ్వలే కాదు మనుషులు కూడా తమ జీవితంలో చాలా వాటిన కోల్పోతూ ఉంటారు.
కోల్పోయిన వాటి గురించి విచార పడక మరింత ఉత్సాహంతో మళ్ళీపనిచేసి వాటిని సాధించే ప్రయత్నం చేస్తారు. దానికి భగవంతుడు కూడాసహకరిస్తాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని