మంట కలిసిన మానవత్వం
మానవత్వపు విలువలను మరిచిపోయి మంచితనాన్ని మంటగలిపే, ఈ కాలపు మనుజుల మనోవైఖరి మారాలి మారాలి, క్షణక్షణం దిగజారి పోతూ జంతుప్రవృత్తితో మిడిసిపడే ఈ తరాన్ని మార్చడం, మన ప్రథమ కర్తవ్యం. స్త్రీ జాతిని ఒక విలాస వస్తువుగా చూస్తూ 6 నుంచి 60 ఏళ్ల ముదసలి వరకు కామ ప్రకోపాలతో రాక్షసత్వం మీరిన మనుషులు మారాలి మారాలి.
విదేశాలలో స్థిరపడి తల్లిదండ్రుల కాయ కష్టం మీద సర్వసుఖాలు అనుభవిస్తూ తల్లితండ్రులను అనాధ ఆశ్రమాలలో చేర్పించి బంధం తెంచుకొనే మనుషులు మారాలి మారాలి
మానవ జన్మ మనుగడకు కరుణ ఒక ఇంధనం, ‘సాటి మనిషి నడిరోడ్డు మీద గుండెనొప్పితో పడిపోతే, అభం శుభం తెలియని ఆడపిల్ల పరుగున వెళ్లి నోటిలో నోరు పెట్టి, ‘గాలి వాయువులు అందించి ప్రాణం నిలబెట్టడం ఒక కరుణరసం, ‘ఆస్పత్రిలో ముక్కు ముఖం తెలియని బాధితులకు, తన రక్తం అందించి ప్రాణం నిలపడం మానవజాతి మనుగడకు నిలువుటద్దం!,
“పుడమిని కరుణ రసం తో, నిలువెల్లా
తడిపి, జగతిని ‘నిత్యకళ్యాణం పచ్చతోరణంగా’,
విర సిల్లెలా ప్రతి మనిషి పాటుపడాలి.*
– వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
🙏🙏🙏👏👏👏👏