నా ప్రాణం
కోకిల గానం నీదైతే
ఆ రాగం నేనవుతా,
కమ్మని కవిత నీవైతే
ఆ కవిత రాసే కలాన్నవుతా,
పూసే పూవువి నీవైతే
నిత్యం నీ వెంటే ఉండే తుమ్మెదనవుతా,
నా హృదయం నీవైతే
ఊపిరి నేనవుతా,
నీవు ప్రేమిస్తే నా ప్రాణం
ఉన్నంతవరకు నీతో ఉంటా..
-కోటేశ్వరరావు ఉప్పాల