నిత్య పోరాటం
నిశీధిలో నిర్భయంగా నడయాడలని
నిరంతరం స్వేచ్ఛవిహంగమై విహరించాలని
నా అంతర్మథనంలో అనునిత్యం
అలుపెరుగని పోరాటమే సల్పుతున్న…..
మాటల తూటాలు నా మదిని
తూట్లు పొడిస్తున్న తొనకని ధైర్యమై పయనిస్తున్న…
అడుగడుగున కామాంధుల
చూపులు బాణలై ఎదకు గుచ్చుకుంటున్న
ఆరని తడి కన్నుల సాక్షిగా ఆనందాన్ని పంచుతున్న….
బేరసారాల నడుమ అంగడి సరుకునై
ప్రాణమున్న జడ పదార్థనై తలవంచుకొని
నిస్వార్థమైన బందానికై ఎదురు చూస్తున్న….
ప్రతినిత్యం కన్నీటి చెమ్మను దుప్పటి
మాటున దాచేస్తు రేపటికైన నా వారి ప్రేమ
మకరందం ఆస్వాదిస్తాననే ఆశతో
ఉషోదయపు ఉషస్సును అందిస్తున్న…
కట్టుబాట్ల కంచెలు నన్ను బంది చేస్తున్న
నా ఆశయ సాధనకు,నా గమ్యానికి
చేరువ చేసే చేతికై చకోర పక్షి నై దీనంగా చూస్తున్న…
నా ఉనికికై, అస్థిత్వానికై సమాజం తో అలుపెరుగని సమరమే సాగిస్తున్న..
-కొత్త ప్రియాంక (భానుప్రియ)