అది చాలు
కాంతి వెంటే ఉంటుంది
కంట పడదంతే
కాలం కదిలిపోతూనే ఉంటుంది
గమనించే తీరికుండదంతే
మాట జారుతూనే ఉంటాం
ఏం కాదన్న నిర్లక్ష్యం అంతే
“ఎగో” గుచ్చుతూనే ఉంటుంది
కానీ “ఎగొనీ”యే గుర్తుంటుంది అంతే
ఫ్రెండ్ ను పలకరించాలనే అనుకుంటాము
అవసరంలేదన్న పంతం ఆపేస్తుంది అంతే
నేనూ నా అహం అంతే
అది చాలు
– సి.యస్.రాంబాబు