రాఖీ పండగ
రాఖీ పండగ వస్తుందంటే అక్కా చెల్లెల్లకు ఆనందం..
అన్నా తమ్ముళ్లకు ఆందోళన ( భయం )..
అదీ ఈ కాలంలో..
వెనుకటి కాలంలో అయితే ఇరు వర్గాలకు సంతోషం
తప్ప వేరే ఏదీ ఉండేది కాదు ..
ఎందుకంటే ఆ కాలంలో ప్రేమలే ఎక్కువగా ఉండేవి ఈ
విధంగానైనా కలుసుకోవడం సంతోషంగా భావించే వారు..
అక్కా చెల్లెల్లు రాఖీ కడితే శుభ సూచకంగా తమ ఆయుష్షు పెరిగి సిరి సంపదలు సమ కూరుతాయని
అన్నా తమ్ముళ్లకు ఒక గట్టి నమ్మకం..
కానీ ఈ కాలంలో అంతా కమర్షియల్!
అక్కా చెల్లెల్లు అన్నలు ఎక్కడ డబ్బులు లేవంటారోనని
ఫోన్ పే చేయించుకుంటున్నారు..
మెుత్తానికి పండగంటే సంతోషపడాలో భయపడాలో తెలియని పరిస్థితి అన్నా తమ్ముళ్లది..
అక్కా చెల్లెల్లది మాత్రం ఎప్పుడైనా ఒకటే పరిస్థితి అనుకోండి..
కాలాన్ని బట్టి మారడమే! ఎవరైనా! నేటి స్థితి..
-ఉమాదేవి ఎర్రం