నీ గుర్తులు

నీ గుర్తులు

నీ గుర్తులే నాలో ఉన్నా
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన ప్రతిక్షణం నాకు గుర్తుకు వచ్చి
నన్ను ఇంకా బాధ పడేలా చేస్తూ
నేను వెళుతూ దారిలో ముళ్లులా ఉంటూ
ఆ ముళ్ళను తీసుకుంటూ
నా గమ్యం వైపు అడుగులు వేస్తున్నా
నీ గుర్తులు నన్ను వదిలి వెళ్ళడం లేదు…
కన్నీళ్లతో కలిసి ఆ గమ్యని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తానని
నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది..
నా బాధ మాటల్లో చెప్పలేకపోయాను…
నా కళ్ళల్లో బాధ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది…
ఎందుకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావ్
నీకోసం ఎదురుచూసే నా చూపుల్లో ఇప్పుడు కన్నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి…
నీ గురించి ఆలోచించకూడదు అనుకున్న ప్రతిసారి
నువ్వు చేసిన అల్లరి నాకు గుర్తొచ్చి
నా మనసుని ఇంకా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది… జ్ఞాపకాల సిరులు కురిపించే ప్రతిసారి నా జీవితం అందమైన పుస్తకంలా ఉండాలని అనుకున్నా
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన క్షణం
నిన్ను మరవలేకపోతున్నాను…

– మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *