ఓ గద్దర్ అన్నా
ఓ గద్దర్ అన్నా..
నువ్వు ప్రజాగళం లెక్క..
యాడికి పోతావ్..
నువ్వు యాడికి పోలేద్..
అరే.. నీకేమీ కాలేదన్నా
ఉద్యమాలకు ఊపిరి పోసినవ్.
పాటై నిలచినవ్..
పాటై బ్రతికినవ్..
ఉద్యమ చైతన్య పాటల రాజువి.
దేశమెరిగిన ప్రజా యుద్ధనౌకవి
రేపటి సంధి, బెజవాడలో నీ
పేరున జరుగు పాటల
నీరాజనంలో నిన్ను మెప్పిస్తారు.
మమ్ము మురిపిస్తారు, నిను మరలా
మాతో పయనింప జేస్తారు.
సలాం గద్దర్ అన్నా.. లాల్ సలాం
-కిరీటి పుత్ర రామకూరి