అక్కనే నాకు పాపగా పుట్టింది

అక్కనే నాకు పాపగా పుట్టింది

రేఖ… నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బై” అని చెప్పి వెళ్ళిపోయాడు అనురాగ్.“అలాగే అనురాగ్. జాగ్రత్త బై” అని చెప్పి కిచెన్ లో పని చేస్తుంది రేఖ.రేఖ ఇంట్లో పని పూర్తి చేసి టీవీ చూస్తుండగా అనురాగ్ ఫోన్ చేశాడు.ఫోన్ స్క్రీన్ మీద అనురాగ్ పేరు చూసి నవ్వుతూ ఫోన్ ఎత్తి ,“హలో… మళ్ళీ ఏం మర్చిపోయారు?” అని అడిగింది రేఖ.

“నీకు ఒకటి ఇవ్వడం మర్చిపోయాను. అది నాకు గుర్తుకు వచ్చింది” అని చిలిపిగా చెప్పాడు అనురాగ్.
“అవునా… ఏంటి అది?” అని అడిగింది రేఖ.ఇలా ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు.అనురాగ్ కి సెలవు ఉన్న రోజుల్లో రేఖని బయట తీసుకొని వెళ్లేవాడు. ఇలా ఒకరు అంటే మరొకరికి ఇష్టం. మాటల్లో చెప్పలేని అంతగా అనురాగ్ కి రేఖ అంటే ప్రాణం.

అనురాగ్  బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి అప్పుడప్పుడు క్యాంప్ కి వెళ్ళేవాడు. నెల రోజుల తర్వాత సడన్గా అనురాగ్ ఫోన్ చేసి ,“నేను ఈరోజు సాయంత్రం క్యాంప్ కు వెళ్లాలి. నా బట్టలు సర్దిపెట్టి ఉంచు” అని చెప్పాడు.“అలాగే అనురాగ్. ఎన్ని రోజులు క్యాంపు?” అని అడిగింది రేఖ.

“వారం రోజులు క్యాంప్ ఉంటుంది” అని చెప్పాడు అనురాగ్.“సరే…” అని చెప్పి ఫోన్ పెట్టేసింది రేఖ.
అనురాగ్ సాయంత్రం వచ్చి క్యాంపుకు బయలుదేరాడు.జాగ్రత్త రేఖ… ఏదైనా ఉంటే కాల్ చెయ్ లేదా పైన ఓనర్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని హెల్ప్ తీసుకో” అని చెప్పాడు అనురాగ్.
కొంచెం బాధగానే ,

“అలాగే అనురాగ్ నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్లి వస్తావు కదా. నాకు రోజు ఫోన్ చేయాలి” అని చెప్పింది రేఖ.
“తప్పకుండా చేస్తాను. నీకు ఫోన్ చేయకుండా నేను ఉండలేను కదా. సరే జాగ్రత్త” అని చెప్పి వెళ్ళిపోయాడు అనురాగ్.

లోపలికి వచ్చే తలపేసుకొని తలుపు వేసుకొని డల్ గా సోఫాలో కూర్చుంది రేఖ.అనురాగ్ లేకపోవడం వల్ల రాత్రి కూడా నిద్ర పట్టలేదు రేఖకి. మరుసటి రోజు ఇంట్లో ఒంటరిగా ఉండలేక పైనున్న ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.

“ఏంటమ్మా ఇలా వచ్చావ్?” అని అడిగింది సునంద.“ఏం లేదండి ఊరికే వచ్చాను” అని చెప్పింది రేఖ.
ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చినా సంతోష్ రేఖాన్ని చూసి ,“హాయ్… రేఖ ఎలా ఉన్నారు?” అని అడిగాడు.

“మీరు… నేను మీకు తెలుసా?” అని అయోమయంగా అడిగింది రేఖ.“అదేంటండీ అప్పుడే నన్ను మర్చిపోయారా? రాజీవ్ వాళ్ళ అక్క మీరే కదా” అని అడిగాడు సంతోష్.“క్షమించండి… నాకు రాజీవ్ అనే పేరుతో ఎవరూ తెలియదు. మీరు పొరబాడుతున్నారు” అని చెప్పింది రేఖ.

“అమ్మ… అమ్మ ఈవిడ రాజీవ్ వాళ్ళ అక్క కాదా?” అని అడిగాడు సంతోష్.“కాదురా… కింద అద్దె కుంటున్న వాళ్లు” అని చెప్పింది సునంద.సంతోష్ కావాలని ఆవిడతో మాట్లాడడానికి రాజీవ్ వాళ్ళ అక్క అనే మాట కలిపాడు. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్.

సంతోష్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడడం జరిగేది.ఇలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది.సంతోష్ ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అసలే పోరంబోకులు  వాళ్లతో కలిసి వీడు కూడా నాశనం అయిపోయాడు.

ఫ్రెండ్స్ తో తిరుగుడు రాత్రిపూట తాగి దొంగ చాటుగా ఇంటికి రావడం దానికి కొంచెం సపోర్ట్ గా సునంద.
సంతోష్ కి రేఖ మీద మోహం కలిగింది. ఒక్కసారైనా తనిని అనుభవించాలని తన ఫ్రెండ్స్ తో చెప్తున్నాడు సంతోష్.

రేఖ ముందు స్నేహంగా ,మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు.సంతోష్ వచ్చాడని కాఫీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్ళింది రేఖ.రేఖ ఫోన్ సైలెంట్ లో ఉండడం వల్ల అనురాగ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.రెండోసారి అనురాగ్ చేస్తే ఆ కాల్ కట్ చేసింది సంతోష్.

వర్క్ బిజీ వల్ల అనురాగ్ రేఖ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కాసేపయ్యాక చేస్తే కట్ చేసింది. ఏదో పనిలో ఉందని తన వర్క్ లో మునిగిపోయాడు.ఊర్లో సునంద అత్త గారికి ఒంట్లో బాలేదని ఫోన్ రావడం వల్ల సునంద వాళ్ళ భర్త ఊరు బయలుదేరారు.

సంతోష్ కి భోజనం కాఫీ టిఫిన్ అన్ని రేఖ వాళ్ళ ఇంట్లోనే పెట్టేది. తన ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం తన ఫ్రెండ్స్ ని తీసుకుని వచ్చి పార్టీ చేసుకునేవాడు సంతోష్.

ఒకరోజు రాత్రి ఫుల్లుగా తాగేసి రేఖ దగ్గరికి వచ్చాడు సంతోష్.బాగా నిద్రలో ఉన్న రేఖ వెళ్లి తలుపు తీసింది.సంతోష్ ని ఆ పరిస్థితుల్లో చూసి తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది.కానీ సంతోష్ వినకుండా బలవంతంగా లోపలికి వచ్చి తనని బలవంతం చేయబోయాడు.

రేఖకి కోపమొచ్చి చెంప దెబ్బ ఒకటి ఇచ్చి, సంతోష్ కాలర్ పట్టుకుని బయటికి గెంటేసింది.సంతోష్ ని బయటికి పంపించేసిన తర్వాత తనకు అసలు నిద్రే పట్టలేదు.

‘సంతోష్ ని ఎలాగైనా మార్చాలి. సంతోష్ లో ఎలాగైనా మార్పు తీసుకురావాలి అని అనుకుంది రేఖ.’
తన చెల్లి స్వీటీకి ఫోన్ చేసి సంతోష్ గురించి విషయం మొత్తం చెప్పింది. సంతోష్ నెంబర్ ఇచ్చింది రేఖ.
“నువ్వు ఏం బాధపడకు అక్క, నేను చూసుకుంటాను” అని చెప్పింది స్వీటీ.సంతోష్ కి ఫోన్ చేసి ,
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా ప్రేమని ఒప్పుకో” అని ప్రపోజల్ పెట్టింది స్వీటీ.“కానీ దానికి మాత్రం సంతోష్ ఒప్పుకోలేదు.”

సంతోష్ అన్న మాటకి నిరాశ పడకుండా ,నీతో కొన్నాళ్లు స్నేహం చేయాలనుకుంటున్నాను. ఆ స్నేహం తర్వాత నువ్వు నా ప్రేమని ఒప్పుకోకపోయినా పర్వాలేదు” అని స్ట్రాంగ్ గా చెప్పింది స్వీటీ.
“స్వీటీ చెప్పిందానికి ఒప్పుకున్నాడు సంతోష్.”

సంతోష్ పక్కనే ఉంటూ తన ఫ్రెండ్స్ తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో? ఎలాంటి వాళ్ళలో తెలిసేలా చేసింది స్వీటీ.”సంతోష్ తో జరిగిన ప్రతి విషయం రేఖకు ఫోన్ చేసి చెప్పేది స్వీటీ.“ఒక వ్యక్తిలో మార్పు రావాలని అనుకుంటే మనకు మనుషులే కాదు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి” అని స్వీటీకి చెప్పి ఫోన్ పెట్టేసింది రేఖ.

సంతోష్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాడు. వాళ్ళ అమ్మానాన్న విలువ ఏంటో ఇంకా తెలుసుకున్నాడు.రేఖ దగ్గరికి వచ్చే క్షమాపణ కోరాడు.తను చదువు కంటిన్యూ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు.

సంతోష్ లో వచ్చే మార్పుని చూడగానే స్వీటీ మనసులో సంతోష్ మీద ప్రేమ కలిగింది.సంతోష్ కి ఎవరు ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల అన్ని స్వీటీతోనే పంచుకునేవాడు. తన మనసులో కూడా ఆ ప్రేమే కలిగింది.

వాళ్ల చదువు పూర్తయిన తర్వాత ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఒకరి ప్రేమ మరొకరికి చెప్పకుండానే ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

ఒకరోజు అనురాగ్ , రేఖ హాస్పిటల్ కి వెళ్లి వస్తుండగా వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. వెంటనే స్వీటీకి కాల్ చేసింది రేఖ.వాళ్ళ ఆనందానికి కారణం ఏంటో చెప్పింది రేఖ.సంతోష్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది స్వీటీ.అక్కడ ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు.

ఒక రెండు గంటల తర్వాత కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది స్వీటీకి.ఫోన్ లిఫ్ట్ చేస్తే అనురాగ్ రేఖలకు యాక్సిడెంట్ అయింది అని తెలిసింది. వాళ్ళు అక్కడే చనిపోయారని తెలిసింది.ఏడుస్తూ సంతోష్ కి విషయం చెప్పింది స్వీటీ.

నాలో నువ్వు స్వీటీ తీసుకువచ్చిన మార్పుని ఎప్పటికీ మర్చిపోలేనిది. నా జీవితం మార్చేసారు మీరు. మీరు మాకు దూరం అవడం చాలా కష్టంగా ఉంది. రేఖను పట్టుకొని ఏడుస్తున్నాడు సంతోష్.
నాకు పుట్టబోయే పాపకి నీ పేరే పెట్టాలనుకున్న అక్క అని చెప్పింది స్వీటీ.

కానీ ఈలోపులే నువ్వు మాకు దూరమవుతావ్ అనుకోలేదు అని ఎంతో ఏడ్చింది స్వీటీ.మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే వాళ్ళు మనతోనే ఉంటారు అని అనుకోవడం తప్పు.అలాంటి వాళ్ళు మనకు ఎప్పుడైనా దూరం అవొచ్చు.

నాలో ఒక మార్పు తెచ్చి నా జీవితానికి మంచి అనే మార్గదర్శకత్వం చూపించి నన్ను మనిషిచేసినందుకు మా అక్కని ఎప్పటికీ మర్చిపోలేను.జీవితం విలువ ఏంటో తెలిసేలా చేశారు అని తనలో అనుకున్నాడు సంతోష్.

ఒక రెండు సంవత్సరాల తర్వాత స్వీటీ , సంతోష్ పెళ్లి చేసుకున్నారు.అక్కనే నాకు పాపగా పుట్టింది చెప్పాడు సంతోష్.9 నెలల తర్వాత ఒక పాప పుట్టింది. పాపకి రేఖ అనే పేరు పెట్టారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *