అంతా స్వార్థమే!!
ఒక పువ్వు..
తను రాజాలా ..
ఉండాలని..
ఒక్క రోజే పూసి..
తన సువాసనలను..
మనకందించి..
తన అందాన్ని చూపించి..
మనలను పిచ్చెక్కించి..
తన స్వార్థం తను చూసుకుని..
వాడి పోతుంది..
మురిపించి మైమరిపించి..
రాలి పోతుంది..
తనది స్వార్థం కాదా?
స్వార్థమే!!
జీవితంలో ఎన్నో పనులు..
చేయాల్సినవి ఉండగా..
ఆ దేవుని చెంతకు చేరి..
పోయే మనిషికీ స్వార్థమే!!
స్వార్థం లేని జీవం లేదు..
స్వార్థం లేని దేవుడూ లేడు..
దేవుడు కూడా తనను..
తలవాలని పిలవాలని..
అందరికీ ఇన్ని బాధలు..
పెడతాడు స్వార్థంతోనే!!
ఈ సృష్టే ఒక స్వార్థం..
నిస్వార్థం మనుషులు లేరు..
ఈ కాలంలో భూతద్దం పెట్టి..
వెతికినా దొరకరు…
అంతా స్వార్థమే!!
– ఉమాదేవి ఎర్రం