జీవన సమరం
సమాజంలో మనుగడ
సాగించాలంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని
నిలబడాల్సిందే. జీవన
సమరం చేయాల్సిందే.
ఊరికే కూర్చుంటే అసలు
కుదరదు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు
తీవ్రంగా కృషిచేయాలి. అప్పుడే
ఆ లక్ష్యాన్ని సాధించగలము.
చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని
చిన్న స్ధాయి నుంచి ఎదిగి
గొప్ప స్ధాయికి చేరిన మన
దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే మనకు ఆదర్శం. ఎక్కడ
నుండి వచ్చావన్నది కాదు,
ఎంతటి స్ధాయి వరకు ఎదిగావనేదే ముఖ్యం.
ఈ లోకంలో పుట్టిన
ప్రతి మనిషి తన
గమ్యాన్ని చేరేవరకు
జీవన పోరాటం చేయాల్సిందే.
అలా కాదని వెనకడుగు
వేస్తే గమ్యం దూరమైపోతుంది.
– వెంకట భానుప్రసాద్ చలసాని