అడక్కునే బతుకు
గుంజెలు పాతి ఉయ్యాలో
గుడిసె కట్టుకుంటే ఉయ్యాలో
గుడిసె పికేసిరి ఉయ్యాలో
కట్టుకున్న గుడిసెలో పాయె ఉయ్యాలో
ఇల్లు కట్టిస్తామని ఉయ్యాలో రోజూ రోజు
తిప్పవట్టే ఉయ్యాలో
బిడ్డ కు పెళ్లి చేద్దామని ఉయ్యాలో
కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే ఉయ్యాలో
కళ్ళలో వత్తులో వేసుకుని ఉయ్యాలో
ఇంకా సుడ వడతిమి ఉయ్యాలో
రైతు బంధు ఇస్తామంటే ఉయ్యాలో
ఉన్న పైసలన్ని కడతిమి ఉయ్యాలో
అవి రకపాయే ఉయ్యాలో పంట ఏయ్యక పోతిమి ఉయ్యాలో
బాలింత కిట్టు అని ఉయ్యాలో అదికటి పెట్టే ఉయ్యాలో
బాలింతలు కిట్టు కోసం ఉయ్యాలో ఎవరు రాలేదమ్మ ఉయ్యాలో,
జన యోజన అని ఉయ్యాలో ఎదోటి పెడితిరి ఉయ్యాలో
అది కూడా రాకపాయే ఉయ్యాలో
కిసాన్ యోజన అని ఉయ్యాలో రాష్ట్ర మంతా పెట్టే ఉయ్యాలో ,
ఏది ఏమైనా ఉయ్యాలో ఏమి రాకపాయె ఉయ్యాలో
కళ్ళనిండా ఆశలు పెట్టుకుని ఉయ్యాలో
షాది ముబారక్ అని సుస్తిమి ఉయ్యాలో
తిరిగి తిరిగి కాళ్ళు కట్టెలాయే ఉయ్యాలో
ఏ పథకాలు రాక ఉయ్యాలో తిని తినక
పస్తులుంటే ఉయ్యాలో ముక్క బియ్యం
పంచబట్టే ఉయ్యాలో ,బడి పిల్లకని ఉయ్యాలో
గుడ్లు పెట్టవట్టే ఉయ్యాలో,ఆ గుడ్లు తిని ఉయ్యాలో
దవాఖాన ల పలైరి ఉయ్యాలో , సేపలు పట్టేసరికి ఉయ్యాలో
భీమా చేస్తిమనిరి ఉయ్యాలో ,ఆ ఉసే లేక ఉయ్యాలో తప్పించుకునిరీ ఉయ్యాలో , ఆహార పథకం అనిరి ఉయ్యాలో
తిన్న వారికి వాంతులాయే ఉయ్యాలో ….
చెప్పుకుంట పోతే ఉయ్యాలో తెళ్లర్తది ఉయ్యాలో ..
తిననియ్యారు తాగాlనియ్యారు ఉయ్యాలో
మేమేట్ల బతికేతి ఉయ్యాలో , భగీరథ అనిరి ఉయ్యాలో
మురికి నీళ్లు రావట్టే ఉయ్యాలో, ఇంకేమీ చెప్తూ ఉయ్యాలో
అందరికీ తెలిసిన భాగోతమే ఉయ్యాలో …
– భవ్యచారు