నేనొక చంద్రిక
నేనొక కళావిహీనంగా మారిన చంద్రికని..
జీవన ప్రయాణంలో కలిపురుషుడి కబంధహస్తాలకి చిక్కిన సున్నితమైన నా దేహపు అక్రందనలో..
శ్వేతవర్ణ శాంతి చిత్తము నన్ను త్యజించి,
ఆక్రోషపు ఎరుపు వర్ణం నన్ను ఆవహించింది..
సస్యశ్యామలంగా వెన్నెల జలపాతాలను ఒలికించే నా భాషణం..
విధివైపరిత్యాల సంద్రంలో లీనమై తన మృదుత్వాన్ని కోల్పోయి కఠినత్వాన్ని అలవరుచుకుంది..
కానీ..
మమతలొలికే నా మనసు మాత్రం
ఈ అవకతవకల పరంపరను జీర్ణించుకోలేకుంది..
– శంభుని సంధ్య