మనసులేని మనుషులు
అయ్యో! నా చుట్టంతా వాళ్లే!
మనసులేని మనుషులే!
ఒక్క సారిగా తెలిసి వచ్చింది మా వారు ఉన్నప్పుడంతా మంచి మనుషుల్లా మనసున్న వాళ్లుగా అంతా నా వాళ్లుగా అనిపించిన వాళ్లే తను పోయాక మనసు లేని వాళ్లుగా మారిపోయారు..
బంధువులు రా బంధువుల్లా మారి పోయారు..
ఇలా ఉంటారా? అని ఆశ్చర్యంతో తెరిచిన నా నోరింకా మూత పడడమే లేదు..
ఎందుకంటే వాళ్లింకా అలాగే ప్రవర్తిస్తున్నారు..
అసలీ మనుషులంటేనె ఒక రకమైన విరక్తి కలుగుతుంది..
ఈ జన్మకు ఈ బంధువర్గం చాలు మరో జన్మంటూ ఉంటే మనసున్న మంచి మనుషుల్లో పుట్టించు దేవుడా! అని దేవుణ్ణి వేడుకుంటున్నా!
– ఉమాదేవి ఎర్రం