మన వేగుచుక్క
వేగుచుక్క సూర్యోదయానికి ముందే తమ పనులు మొదలు పెట్టేవారికి ఆకాశం నుండి చక్కటి మార్గనిర్దేశం చేస్తుంది. నాకు తెలిసిన వారిలో ఎంతో మంది అలా వేగుచుక్కలా సమాజానికి తమ వెలుగును ప్రసరింపచేస్తూ ఇతరులకు ప్రేరణ ఇస్తున్నారు. మన రచయితలలో వేగుచుక్కలా ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ ముందడుగు వేస్తున్నారు భవ్య గారు.
ఆవిడ జీవితంలో కష్టాలెన్నే తొంగి చూస్తున్నా వాటన్నింటినీ అధిగమించి, తెలుగు భాష మీద మక్కువతో తెలుగు భాషాభివృద్దికి తన శక్తికి మించి కృషిచేస్తున్నారు. ఒక వెబ్సైట్ మొదలుపెట్టి ఎంతోమంది రచయితలకు ప్రోత్సాహం అందిస్తూ ముందడుగు వేస్తున్నారు. ఐదారు సార్లు వెబ్సైట్ హ్యాక్ అయినా కూడా వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూనే ఉన్నారు. నిజంగా అది గొప్ప విషయమే.
అక్షరలిపికి ప్రాణం పోసి తన జీవితాన్ని ఆ సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న భవ్యగారికి అభినందనలు. గ్రూపులో ఉన్న రచయితలు కూడా తమ కధలను పంపుతూ అక్షరలిపి ఎదుగుదలకు కారణం అవుతున్నారు. వారందరికీ కూడా అభినందనలు.
– వెంకట భానుప్రసాద్ చలసాని
ఆ వేగుచుక్క ఆశయం త్వరలో సిద్ధించాలని కోరుకుందాం