ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న…
కన్నీటి పాటల మీద సాగుతున్న
ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న…
బడుగు, బలహీన, పేదప్రజల విముక్తికై
హక్కుల కోసం పోరాడిన విప్లవకారుడు
కరుడుగట్టిన అగ్రకుల ఆధిపత్య భూస్వామ్య పెత్తందారులా అరాచకాలపై ఎక్కుపెట్టిన పాటల తూటా…
కాలికి గజ్జకట్టి డప్పుదరువేస్తూ
గుంతెత్తి పాట పాడుతూ
పాటతోనే విప్లవాన్ని సృష్టించి
ప్రజల్ని చైతన్య పరిచిన
సాంస్కృతిక చైతన్య ప్రజా కళాకారుడు
నీ ఆట పాట మాట
ప్రజల గుండెల్లో చిరస్మరణీయం…
అమరహే హమారహే
గద్దర్ అన్న అమర్ రహే
జోహార్ జోహార్…
గద్దర్ అన్నకి జోహార్…
– బొమ్మెన రాజ్ కుమార్