మాటల్లో చెప్పలేనిది

 మాటల్లో చెప్పలేనిది

అప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నాను. అమ్మ నాన్న పనికి వెళ్లారు మీ ముగ్గురు స్కూల్ కి వచ్చాం. ఆరోజు నాకు ఆటల్లో మొదటి బహుమతి వచ్చింది.

ఆ బహుమతి అమ్మకి చూపించాలని ఎంతో ఆశతో సాయంత్రం ఇంటికి వెళ్లాను.
ఎప్పుడెప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు ఆరు అవుతుందా? అని ఎదురు చూస్తూ ఉన్నాను నేను.

నా కళ్ళు కాయలు కాచిపోయాయి టైము అలాగా అయిపోతూనే ఉంది ఆరు కాస్త ఏడు, ఏడు కాస్త 7:30 అయ్యింది.

అప్పుడు నాన్న ఇంటికి వచ్చారు.“నాన్న అమ్మ ఏది ఇంకా రాలేదు” అని నేను ఆత్రుతగా అడిగాను.
“అదేంటి ఇంకా రాకపోవడమేంటి? పని దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది కదా” అని చెప్పాడు నాన్న.

“అయితే మా పెదనాన్నకి ఫోన్ చేసి జ్యోతి ఇంకా ఇంటికి రాలేదు. మీ ఇంటి దగ్గర ఉందా?” అని అడిగాడు నాన్న.

“సాయంత్రం వాళ్ళ అక్క తో పాటు మా ఇంటికి వచ్చేసింది” అని చెప్పారు మా పెదనాన్న.
నాన్న నేను అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఫోన్ తీసుకున్నాను.

పెదనాన్న ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వరా అని అడిగి  , అమ్మతో ఫోన్లో మాట్లాడాను.పని దగ్గర ఏదో గొడవ వల్ల నాన్న అమ్మని కొట్టాడంట.

అమ్మ కోపంతో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది అని ఫోన్లో నాకు చెప్పింది.అయితే రెండు రోజులు పోతే తనే వస్తుందిలే అని మా ముగ్గురికి సరిది చెప్పారు నాన్న.

మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళాం.అమ్మ స్కూల్ దగ్గరికి వచ్చి నన్ను కలిసింది.ఏవో పెద్దపెద్ద మాటలు చెప్పింది ఆ వయసులో నాకు అర్థం కాదు.

మా చుట్టాల ద్వారా మా అమ్మ ఇంకెప్పుడూ రాదు అని మా నాన్నకి వేరే పెళ్లి చేస్తారు అని అంటే విన్నాను.
కానీ మా అత్తయ్య జరక్కుండా మా అమ్మ పక్కన మాట్లాడి వాళ్ళిద్దర్నీ కలిపింది.అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

కానీ తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడితే ఆ పిల్లలు ఎంత బాధ పడతారో అని ఒక్క క్షణం కూడా ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు.

ఇలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో జరిగాయి. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది.

ఆ జ్ఞాపకాలుఇప్పుడుతలుచుకుంటే ఇప్పుడు బాధగా ఉన్నా అప్పుడు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది..

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *