మమతల కోవెల
కన్న తల్లిదండ్రులతో కొంతకాలం గడపటానికి గ్రామానికిబయల్దేరాడు చేతన్. అతనికితల్లిదండ్రులను చూడాలనే
కోరిక కలిగింది.
వెంటనే వారంరోజులు సెలవు పెట్టి స్వగ్రామంబయలుదేరి వెళ్ళాడు. అతనుతన తల్లిదండ్రులకు వస్తాననిచెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామనిఅనుకున్నాడు. మొత్తానికిబస్సు దిగి ఇంటికి వెళ్ళాడు.
గుమ్మం దగ్గర చెప్పులు విడిచిఇంట్లోకి వెళుతుండగా తండ్రమాటలు వినపడ్డాయి. ” మనవాడు సిటీకి వెళ్ళాక మనకు
ఇక్కడ చాలా ఒంటరితనంగాఅనిపిస్తోంది.
మనం వెళ్ళి అక్కడ ఉందామన్నా ఆ సిటీలోమనం ఇమడలేము. పైగా వ్యవసాయం చేసేవారు లేక మన పొలం బీడు పడుతుంది ఏమి చేయాలో తెలియటం లేదు” అన్నాడు చేతన్ తండ్రి
చేతన్ తల్లితో.
అప్పుడు ఆతల్లి”నిజంగానే వాడు లేకపోతేఒంటరితనంగా అనిపిస్తోంది.బుడి – బుడి అడుగులు వేసేవయసు నుండి క్రితం సంవత్సరం వరకు వాడినివదిలి మనం ఉండలేదు.
ఇప్పుడేమో సంవత్సరంనుండి వాడు మన ఇంటికిరాలేదు. పొలం పనులు అయ్యాక మనమే వాడిదగ్గరకు వెళ్దాం. వాడులేకుండా మనం ఉండలేము”అంది.
ఆ మాటలు విన్నచేతన్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తల్లిదండ్రులనువిడిచిపెట్టి సిటీలో జాబ్చేయడానికి వెళ్ళి తప్పు
చేసానని తెలుసుకున్నాడు.
ఊరిలో చాలా పొలం ఉంది.వ్యవసాయం చేస్తూ తల్లిదండ్రులతో ఉండాలిఅని డిసైడ్ చేసాడు.మమతల కోవెల లాంటిఇల్లు ఉంది.
అవన్నీ వదిలేసిసిటీలో ఎండమావులు వెంటపడటం వెర్రితనంఅనిపించింది.
తన నిర్ణయంమంచిదని అతని అంతరాత్మచెప్పింది.
మంచి నిర్ణయంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు చేతన్.
-వెంకట భానుప్రసాద్ చలసాని
Bagundhi sir 👌