అక్షరలిపితో నా అనుభవాలు నా జ్ఞాపకాలు
నేను ఈ గ్రూపులో జాయిన్ అయ్యి 7 నెలలు 20 రోజులు అవుతుంది. నేను మొదట్లో కవితలు అంతంత మాత్రమే రాశాను. గ్రూప్ అడ్మిన్ గారు నన్ను చాలాసార్లు హెచ్చరించారు.
కవితలు నాలుగు ఐదు లైన్లు రాయకూడదు ,పెద్దగా రాయండి అని ఎన్నోసార్లు చెప్పారు.మొదటిసారి నేను వీడియో కాల్ కి వెళ్ళినప్పుడుఅంతమందితో ఎప్పుడూ నేను వీడియో కాల్ మాట్లాడలేదు.
ఒకరిద్దరుతో తప్పించి అందరూ కొత్తగానే కనిపించారు. అప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. వీడియో కాల్ లో కొత్త కొత్త నియమాలు చెప్పేవారు.
మళ్ళీ గ్రూప్ లో ఆ కొత్త నియమాలను పెట్టేవారు.తర్వాత ఎన్నోసార్లు వీడియో కాల్ నిర్వహించారు. అందులో కొన్నిసార్లు నేను వెళ్ళినా కొన్నిసార్లు వెళ్ళలేకపోయాను.
నాలో మార్పు తెచ్చుకోవాలని కథలు , కవితలు అన్ని రాసి పేరు తెచ్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాను.గ్రూప్ నుండి పాత వాళ్ళు కొందరు వెళ్లిపోయిన ,
కొత్త వాళ్ళు రావడం వాళ్ళని పరిచయం చేసుకోవడం వాళ్లతో నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవడం నాకు ఆనందంగానే ఉండేది.
ఇలా వీడియో కాల్ అందరితో కలిసి మాట్లాడడం నాకు చెప్పలేని ఒక అనుభూతి.ఆ అనుభూతిని మాటల్లోనే కాదు ఎందులోనూ వర్ణించలేకపోయాను.
ప్రతిరోజు వదలకుండా కథలు , కవిత్వాలు రాసి బాగా రాస్తున్నానని పేరు సంపాదించుకున్నాను.
ఆ పేరు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ కథలు , కవితలు ఎప్పటికీ వదులుకోకుండా రాస్తూ ఇలాగే మంచి పేరు సంపాదించాలని నా కోరిక.
ప్రశంస పత్రాలు కూడా వచ్చాయి నాకు.కానీ అవి లెక్క పెట్టలేనివి.నన్ను ఇంకా ఇంకా ప్రోత్సహిస్తున్న ఈ అక్షరలిపికి నా జీవితాంతం కృతజ్ఞత భావంతో ఉంటాను.
మొదటిసారి కవి సమ్మేళనం పెట్టినప్పుడు కవిత అందరి ముందు చెప్పడానికి మొదట తడబడ్డాను.రెండవ సారి కవి సమ్మేళనంలో కవిత బాగా చెప్పెనని పేరు సంపాదించుకున్నాను.
ఇలా పోటీలకు కూడా కవితలు రాసి ప్రశంస పత్రాలు సంపాదించాను. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వీడియో కాల్స్ లో నేను కొంచెం హుషారుగా పాల్గొనడం నాకే ఆశ్చర్యం కలిగింది.
నాలో ఇంత మార్పుకి కారణమైంది ఈ గ్రూపు.అడ్మిన్ గారికి ప్రత్యేక నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
వారి ప్రోత్సాహమే నన్ను ఇంతవరకు నడిపించింది.
ఇప్పుడు నేను గ్రూపులో ప్రధాన రచయితగా పేరు తెచ్చుకున్నాను అంటే నాకే ఆశ్చర్యం కలిగింది.ప్రధాన రచయితల్లో నేను ఒకదానిగా అంటే బాధ్యతలు నెరవేరుస్తానో లేదని కొంచెం అనుమానంగా ఉంది.
ఒకటి మాత్రం ఒప్పుకుంటాను , నాకు ఇచ్చిన ఈ గౌరవానికి నేను బాధ్యతగా ఉంటానని హామీ ఇస్తున్నాను.ఇంకా మా గ్రూపులో ఉన్న ఎడిటర్ గారు ప్రణవ్.
అక్క అని పిలుస్తే ఒక తమ్ముడు అయిపోయారు.ఎప్పుడు సరదాగా మాట్లాడే హుషారుగా ఉండేలా చేస్తారు.
నేను రాసిన కవిత ఆడియో రికార్డ్ చేసినప్పుడు అది యూట్యూబ్లో విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.
నా వాయిస్ అంటే నాకే నచ్చదు అనిపించేది. అలాంటిది నా వాయిస్ తో కవిత చెప్పడం అంటే ఇంకా ఆనందంగా అనిపించింది.
ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలంటే నేను మొహమాటం పడేదాన్ని అలాంటిది ఇప్పుడు ధైర్యంగా అనిపించింది చెప్పేస్తున్నాను.
నాలో కొన్ని మార్పులకు కారణం ఎవరు అని చెప్పలేను. ఆ మార్పు చూస్తుంటే నాకే ఆశ్చర్య కలుగుతుంది.
అక్షరలిపితో నాకు ఎన్నో అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నాయి.
అవి ఎప్పటికీ మర్చిపోలేనివి , అలాగని ఎప్పటికీ విడవలేనివి.ఇలా పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది.
అందరికీ నా కృతజ్ఞతలు తప్పు చేస్తే నన్ను క్షమించండి..
నేను నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చేదాన్ని , మరొకటి అక్షరలిపి కుటుంబానికి రుణపడి ఉంటాను.మళ్లీ ఒకసారి మీకు స్నేహితులు దినోత్సవం శుభాకాంక్షలు..
-మాధవి కాళ్ల