ఊపిరి
స్నేహం ఋతువు కాదు కొద్ది కాలానికి మారిపోటానికి
స్నేహం వర్షం కాదు కురిసి కురిసి ఆగిపోటానికి
స్నేహం నిప్పు కాదు మండి, వెలిగి, కాలి బూడిద అవడానికి
స్నేహం మెరుపు కాదు వెలుగునిచ్చి ఆరిపోటానికి
స్నేహం పువ్వు కాదు సువాసనలు వెదజల్లి ఎండిపోటానికి
స్నేహం ఊపిరి
నడిచేది నడిపించేది ఒక్కసారి ఆగితే ఇంకేమి మిగల్చనిది
-రహంతుల్లా