అపార్ధం చేసుకోకండి
చాలా మంది ఆడవాళ్లుమగవారిని అపార్ధం చేసుకుంటారు. ఆకారంచూసి మగవారి గుణాన్నిఅంచనా వేస్తారు. మొరటుగాకనిపించేవారంతా చెడ్డవారుకాదు.
అలాగే చక్కగా మాట్లాడేమగవారిలో కూడా మేకవన్నెపులులు ఉంటారు. అలవాట్లుఉన్నవారంతా చెడ్డవారు అనిభ్రమ పడుతూ ఉంటారు.
ఏచెడు అలవాటు లేని వారిలోకూడా రాక్షసులు ఉంటారు.ఎలాగైతే పుస్తకం పై ఉన్నఅట్టను చూసి పుస్తకంలో ఉన్న విషయాన్ని అంచనావేయలేమో అలాగే మనిషిఆకారంచూసి,భాషను వినిఏ మనిషినీ అంచనా వేయలేం.
మహాకవి శ్రీ.శ్రీ గారికి, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి ఇలా ఎందరో మహానుభావులకు ఏదో
ఒక చిన్న వ్యసనం ఉన్నదనివారిని చెడ్డవారని అనగలమా.
చంద్రునికో మచ్చలాగ ఉండే వారి వ్యసనాలను పట్టించుకోకుండా వారుసమాజానికి చేసిన మేలునుమాత్రమే గుర్తుచేసుకునివారికి ఘన నివాళి ఇవ్వాలి.
వారు సమాజాన్ని ఉత్తేజపరిచిన విధంగామరెవరూ ఈ సమాజాన్నిఉత్తేజపరచలేదేమో.చాలా మంది మగవాళ్ళుఅనవసరంగా ఆడవారిదృష్టిలో చెడ్డవారిగా
ముద్రవేయించుకుంటూఉన్నారు.
-వెంకట భానుప్రసాద్