మనసు
నమ్మిన స్నేహం నమ్మక ద్రోహనికి పాల్పడిన వేల ఆ వ్యక్తి స్థానం ఆ మనసులో స్మశాన వాటికకు చిహ్నం.జీవన బ్రతుకు పయనంలో అహంకారం అనే గర్వపు శిఖరం నీవూ ఎక్కిన వేల ఒక్క సారి స్మశానం వైపు నీ చూపు దించి చూడూ కుల మత వర్గం చిన్న పెద్ద అనే బేధం లేకుండా సమాధిలు సాక్షిగా కనిపిస్తాయి నీకూ…అంతా సమానమే అనీ..
రక్త మాంసపు ఆస్థి పంజరం లో ఎన్ని కాంక్షలో…మెదడుకు నచ్చింది పనీ..తన పనీ తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది..మనసుకు నచ్చింది భావం.. ఆసక్తి ఉన్న వరకే ఉంటుంది..
కానీ హృదయం కూ నచ్చినది హృదయములో స్థానం సుస్థిరం చేసి హృదయపూర్వకంగా ఆ బందాన్ని పదిలంగా బంధించుకుంటుంది..
అటువంటి బంధాలకు ఒట్టిమిట్టలు కూడా అతీతం…
&&&&&&&&&&&&&&&&&&
చివరి గడియాలలో ఉన్న తన తండ్రి తన తనయులకు ఏం చెపుతాడా అనీ ఎదురు చూస్తుంటే ఆ తండ్రి ఏం అడిగారో తెలుసా రాగి జావా తాగాలి అనీ ఉంది అనీ అడిగారు…ఇదేంటి నాన్నగారు ఇలా అడుతున్నారు అనీ విస్తూ పోయి ఒకరికి ఒకరు చూసుకున్నారు తన పిల్లలు…కానీ ఆ తండ్రి ఆ రాగి జావా తాగి సంతోషంగా తన ప్రాణం విడుస్తాడు…
ఇదేంటి అమ్మ నాన్న ఇలా చేసారు అనీ తన పిల్లలు తన తల్లిని అడుగగాచావు ఇక తప్పదు తథ్యం అనీ తెలిసిన వేల చింతేందుకు సంతోషంగా ఆహ్వానం పలికారు మీ నాన్న గారు అనీ తన తల్లీ సమాధానం ఇస్తుంది…
ఈ జన్మ వరకే ఈ బంధాలు.. ఈ జన్మ వరకే ఈ బరువులు భాద్యతలు నటన మహా నటన చేయడానికి వచ్చిన మర మనుషులం మనము ఆట ముగిసాకా తప్పదు ఇక చేరుకోవాలి మన గమ్య స్థానముకు…
అందుకే ఈ ఆటలో ఎంత వరకూ ఉంటామో తెలీదు ఎపుడు వైతోలుగుతామో తెలిదు ఉన్నంత కాలం ప్రతి బంధాన్ని పలకరించండి.. తరువాత మీరు పలకరించాలి అనీ అనుకున్న కూడా అందని బంధాలు ఎన్నో అంటూ తన తల్లీ కూడా తుది శ్వాస విడుస్తుంది…
-కళ
అద్భుతం కళ చాలా బాగా రాసావు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐