మనిషి జీవితం
మనిషి… ఓ… మనిషి
నీకెందుకు ఇంత అహంకారం
నీకెందుకు డబ్బు మీద ఆశ
ఉన్నదానితో తృప్తి చెందకుండా అత్యాశకు పోతూ
డబ్బే అందరి ఆడిస్తుందిఅని అనుకుంటూ
డబ్బుంటేనే మనిషికి విలువ ఉంటుందని నువ్వు నమ్ముతూ
పుట్టినప్పుడు నుండి ఒక మనిషి గా ఏమి తీసుకొచ్చావ్
మనిషి బ్రతికున్నంత కాలం అందరితో కలిసి మెలిసి ఉంటూ
నీకంటూ ఒక నలుగురు వ్యక్తుల దగ్గర మంచి పేరు సంపాదించుకుంటూ
నువ్వు మరణిస్తే నీతో పాటు ఆస్తి , డబ్బులు
తీసుకెళ్లలేవని ఎందుకు గ్రహించలేకపోతున్నావ్
ఈ మనిషి శరీరం కొన్నాళ్ల తర్వాత మట్టిలో కలిసిపోతుంది…
డబ్బు మీద మక్కువ పెంచుకోవడం అవసరమా
ఇతరులతో అహంకారంగా ప్రవర్తించడం అవసరమా
నీ అనే వాళ్ళతో ఛీ కొట్టించుకోవడం అవసరమా
నువ్వు చివరికి వెళ్లాల్సిన స్థానం ఒలుకులు మిట్ట అని మరిచిపోతూ
చివరికి మిగిలేది బూడిద అని తెలుసుకోలేక
మనిషి శరీరాన్ని చెడు అలవాట్లకు బానిస చేస్తూ
మనిషి ఓ మనిషి
నువ్వు మంచి , చెడుల గురించి ఆలోచించకుండా
ఎందుకు తెలుసుకోలేకపోతున్నావ్ నీ జీవిత సత్యాన్ని
ఓ మనిషి తెలుసుకో
నీ జీవితం విలువ గురించి
మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదు…
మనిషి పుట్టుకలో అన్నీ సహజమే
అవి తెలుసుకొని బతుకుతే జీవితం సాఫీగా సాగిపోతుంది..
-మాధవి కాళ్ల