తీరని కోరిక
“సినిమాలో నటించాలనిఉంది నాన్నా” అన్నాడుహరి తన తండ్రితో.” ముందు డిగ్రీ పూర్తిచెయ్యి. ఆ తర్వాతసినిమా అవకాశాలకోసం ప్రయత్నం చెయ్యి”అన్నాడు హరి తండ్రిజాలయ్య. సరేననిచక్కగా చదివి డిగ్రీపూర్తి చేసాడు జాలయ్య.
ఆ తర్వాత మళ్ళీ తనతండ్రి వద్దకు వెళ్ళి” నాన్నా,నా డిగ్రీ పూర్తి అయ్యింది.నేను సినిమాల్లో నటించాలనిఅనుకుంటున్నాను” అన్నాడు.
అప్పుడు జాలయ్య” చూడుబాబూ,నేను రిటైర్ అయ్యాను.నీ తర్వాత ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి చదువుపూర్తి అవ్వలేదు. నువ్వే ఏదోఒక ఉద్యోగం చేసి వాళ్ళనుచదివించాలి.
అంత కంటేవేరే మార్గం లేదు” అన్నాడుకొడుకుతో. తమ్ముళ్ళ చదువుకోసం ఐదేళ్లు ఉద్యోగం చేసితండ్రి బాధ్యతల్లో భాగంపంచుకున్నాడు హరి. హరితమ్ముళ్ళ చదువు పూర్తి అయ్యాక ,
తలో దారి వెళ్ళిఉద్యోగం చేసుకోసాగారు.తల్లి గతించాక తండ్రి జాలయ్య ఒక్కడే హరితో ఉంటున్నాడు. జాలయ్య ఆరోగ్యం బాగాలేకపోవటంతో హరి తండ్రినికంటికి రెప్పలా కాపాడుకుంటూఉన్నాడు.
ఒకప్పుడు హీరోగాసినీపరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకున్న హరి ఇప్పుడుకారెక్టర్ ఆర్టిస్ట్ అవకాశం వచ్చినా ఫరవాలేదు అనిఅనుకుంటున్నాడు.
పాతికేళ్లవయసులో ఉన్న పటుత్వంముఫ్ఫై అయిదేళ్ల వయసులోఎలా ఉంటుంది? హరి పరిస్థితిఅదే. శరీర ఆకారం మారింది.అతన్ని హీరోగా ఎవరూ తీసుకోవటం లేదు.
కనీసంకారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినాఅవకాశం వస్తుందని అన్నిస్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు హరి.అది అతనికి తీరని కోరికగామారిందా? అతనికి అవకాశంవస్తుందా అనే దానికి కాలమేసమాధానం చెప్పాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని