కమ్ముకున్న మేఘాలు

కమ్ముకున్న మేఘాలు

 

కమ్ముకున్న మేఘాలు కారుమబ్బులై
కాటేస్తున్న వేళ ..
ఈ ఆగిపోని వాన..
మోగిస్తుంది రైతన్న గుండెల్లో మృదంగ వీణ..
పంట భూమిలో నేలతల్లి కానరాక..
విత్తనాలు చల్లడానికి వీలులేక..
పారే సెలయేటిని తలపించే నీటి దార..
చూసి ఎం చేయాలో పాలుపోక ..
ఈ ఆగని వాన ఇకనైనా అగుతుందేమో అనే చిన్న ఆశతో ..
ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ రైతన్న..
అతని ఆశలు ఫలించి వాన ఆగితేనే తినగలము తిండిని హాయిగా..
లేనిచో తప్పవేమో తిండిగింజల కోసం తంటాలు ..
ఆకలి బాధ తెలిసిన అన్నదాత..
పండిస్తూనే ఉంటాడు పంటను ఏదో విధంగా..
కాని కనికరించాలిగా ఆ వరుణ దేవుడు చల్లగా..
పంటను పండించడానికి వీలుగా.

 

-హైమా

0 Replies to “కమ్ముకున్న మేఘాలు”

  1. అవునండీ. అన్నదాతకు అన్నీ కష్టాలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *