ఆగని వాన
వానలు ఒకపక్క ఆగడం లేదు, ఇంకోపక్క తగ్గడం లేదు. వానలు పనికి ఆటంకాన్ని కలిగిస్తున్నాయి.
ఆఫీసుకు వెళ్లాలి అంటే వానలు అడ్డుగా వస్తున్నాయి. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి మేలు కనిపిస్తున్నా, ఆన్ ఫీల్డ్ వాళ్లకి కష్టాలు కనిపిస్తుంది.
జలుబు దగ్గు రూపంలో రోగాలు వెంటాడుతున్నాయి. తుమ్ముల వలన గుండెలకు ప్రశాంతత కనిపించట్లేదు. ఒకపక్క స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు మాత్రం ఆగని వర్షాలు సరదాగా హాస్యాన్ని ప్రేరేపిస్తున్నాయి.
అటువంటి వాళ్ళకి ఇంక ప్రతిరోజూ పండగే. ఇంకా మరి వయసులో పెద్దవాళ్ళు అయితే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. మనసుని రంజింప చేసే ఆనందం ఈ వాన సొంతం.
బయట ప్రయాణించడానికి ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు కలిగిస్తున్నా ఈ వాన, ప్రయాణాన్ని మంచి జ్ఞాపకాన్ని చేసే ఒక వారధిగా మారుతుంది కలకాలం అవే జ్ఞాపకాలు మదిలో ఉంచేలా చేస్తుంది.
వాన కాలంలో నెమలి పించ విప్పుకుని నాట్యం చేసే ఆ సుమధుర దృశ్యాన్ని తిలకించే మన నేత్రానందానికి అదుపు లేదు. ఈ ఆగని వర్షాలు చెట్లని మొక్కలని విస్తరింపజేసి.
గొప్ప గొప్ప అడవులుగా చేసి అడవుల మధ్య మనం నివసించేలా చేసి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తూ మన ప్రాణాయువైన ఆక్సిజన్ ని పెంచుతూ మన ఆరోగ్యానికి దోహదపడుతుంది.
కొత్తగా ఆఫీసులో జాయిన్ అయిన నాకు మాత్రము ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఆఫీసులో ట్రైనింగ్ కి వెళ్ళాలి అని ఆలోచన తోలిగిస్తూ ఇంట్లోనే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే సువర్ణం అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
-హరీశ్వర
చాలా బాగా చెప్పారు..
వాస్తవ పరిస్థితిని చక్కగా వివరించారు.