అస్తవ్యస్త కరోనా
కరోనా సమయం మనందరికీ కష్ట కాలం. పెళ్లిలలో సందడి కరువయింది. వంద మంది పరిమితి తోటి పెళ్లి చేసుకున్నారు. కాజల్ అగర్వాల్ పెళ్లి కూడా గుప్తముగా జరిగిపోయింది.
విద్య విలువని తగ్గించిన కాలం అది. ఇంటి నించి విద్య సరికొత్త ప్రతిపాదన. అమలులో అది కష్టమైనా కాని సుసాధ్యం అయింది. పనిని అపహాస్యం చేసిన కాలం అది.
ఇంట్లో పనిలోవున్న మొగవాళ్లు వాళ్ల సతీమనులతో పడిన ఇక్కట్లు చూస్తూనే నవ్వుకుంటూ సందడిగా గడిపాము. వంటపని, ఇంటిపని, బట్టలు ఉతికి ఆరవేసి, మడత పెట్టే పని విసుగులో వున్న మహిళామణులు వారి శ్రీవారికి కొన్ని ఇంటి పనులు చెప్పే హాస్య సన్నివేశాలు ఎన్నెన్నో.
ఇంట్లో మొగవాళ్లయినా ఆడవాళ్లయినా పిల్లలయినా పెద్దవాళ్ళయినా అందరూ పనిని సమానముగా పంచుకుని, ఎవరి పని వాళ్లు చేసుకుని సమానత్వాన్ని చాటి చెప్పే అద్భుతం ఆ సందర్భం.
సమాజములో పురుషులకి ఆఫీసు వెళ్ళేటప్పుడు ఇచ్చే గౌరవం ఇంట్లో పని చేసేటప్పుడు కాస్త తగ్గింది. మహిళా లోకం నిద్ర నించి లేచింది.
బాహ్య ప్రపంచములో అస్తవ్యస్తముగా నెలకొన్న కరోనా, అంతర్గతముగా కుటుంబ విలువలను పెంచింది. బంధువుల ఇంటికి వెళ్ళలేకపోయిన వాళ్ళకి zoom వల్ల సంబంధాలు మెరుగుపడ్డాయి.
మొత్తానికి సమాజములో చెరపలేని ముద్ర వేసింది ఈ కరోనా అస్తవ్యస్తము.
-హరీశ్వర