కరోనా పోయింది
ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేసిప్రజలందరినీ కాల్చుకుతిన్నకరోనా అంటే అందరూ భయపడ్డారు. అసలు
ఏమి జరుగుతుందో తెలియక,ఎందుకు ప్రజలు మరణిస్తున్నారో తెలియకఅందరూ విలవిలలాడారు.
కరోనా మాత్రం మానవాళినిదుంపనాశనం చేస్తూ తనప్రతాపాన్ని చూపింది. ఒకర్నిఒకరు కలిసేందుకు భయపడిఇళ్ళలోనే ఉండిపోయారు.దానికి తగ్గట్టు రకరకాల పుకార్లు షికార్లు చేసాయి.
ప్రభుత్వం కూడా నిశ్శహాయంగా నిలిచింది.ఏవో కంటితుడుపు చర్యలుచేపట్టింది. లాక్ డౌన్ అనిప్రకటించి, అందర్నీ ఇళ్ళలోఉండే విధంగా సూచనలుఇచ్చింది.
వైరస్ కు వాక్సిన్కనుగొనేందుకు రెండేళ్ళుపట్టింది. మరణించిన వారికిఅంతక్రియలు చేసేందుకు సొంత వారే వెనుకాడారు.అనాధ శవాలుగా అవిదహనం చేయబడ్డాయి.
ఆహారం అందక పేదవారిపేగులు మలమల మాడాయి.కొన్ని స్వచ్ఛంద సంస్ధలుతమ వంతు సాయం చేసినాఅది ప్రజలకు అరకొరగా అందింది. నేను చాలాఇబ్బందులు పడ్డాను.
మాఅమ్మగారు లాక్ డౌన్ కుమూడురోజుల ముందుగుండెపోటుతో మరణించారు.మేము ఊరికి వెళ్ళి అమ్మదహన కార్యక్రమంలో పాల్గొన్నాక లాక్ డౌన్ వల్ల రెండు నెలలు అక్కడే ఉండిపోయాము.
అమ్మ దినకార్యక్రమాలు కూడా సరిగా చెయ్యలేక పోయాము. ఇంటికితిరిగి వచ్చాక క్వారంటైన్లో ఉన్నాము. ఆ తర్వాత మాబాబాయి చనిపోయారు.
ఆయన కూడా గుండెపోటువచ్చి మరణించారు. నేనుఎలాగోలా ఆ దహన కార్యక్రమంలో పాల్గొన్నాను.అందరూ వెళ్ళవద్దనే చెప్పారు.
తమ్ముడు ఒకడే బాధపడతాడు అని అతనికిసాయంగా నేను వెళ్ళాను.మహారాజులా బ్రతికిన మాబాబాయి అంతిమ కార్యక్రమంలో ఐదుగురుమాత్రమే వచ్చారు.
అలాంటిపరిస్థితి పగవారికి కూడారాకూడదు. పిల్లలు ఆన్లైన్క్లాసులని ఎంత ఇబ్బంది పడ్డారో వారి తల్లిదండ్రులకుతెలుసు.
చాలా మందికిఉద్యోగాలు పోయాయి.ఉద్యోగాలు ఉన్నా జీతాలుఅందక ఇబ్బందిపడినవారు ఎందరో. అలాంటిపరిస్థితి నుండి ఇప్పుడుబయటపడినా ఆ సమయంమనకొక పీడకలగా మిగిలింది.ప్రజలకు ఆరోగ్య విషయాల్లోజాగ్రత్తలు నేర్పింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని