కాలాలు గమనాలని
యాకాసి పండగని యాతమేయడం
ఆపితే కవనమన్నది కుండలోకి
రానంటుంది తెలవారని స్వప్నంగా
చీకటితో నిదిరిస్తు నీకు శివుడంటే
తెలియదని కాదు పొమ్మంటుంది
శివయ్యా…ఓనా…శివయ్యా…
నేను విన్నది నిజమేనయా…
శూన్యాన మ్రోగేటి ఏకాంతానికి
రూపుడవు లోకాలను పాలించేటి
పాలనేత్రుడవు కష్టించే వాడికి
ఫలితాన్నిచ్చే దీవెనవు నీవేనయా..
శివయ్యా…ఓనా…శివయ్యా….
ఎవరన్నదో కాదు మాటలు కాయాన్ని
నింపలేవు నేనన్నది నిజమే కదా…
నా తలిదండ్రులకు కాలు దువ్వని
బసవన్న కళ్ళార చూస్తున్నాడు…
కష్టాన్ని మరిచిన వారందరు చెప్పేవే
నీతులని శివయ్యా…ఓనా…శివయ్యా…
కదిలే కాలాలు గమనాలని…
క్షణమన్నది మారేటి గుణమని
కాయని సమయానికి కలవరపాటు
చెందుతు తరిగేటి జీవితం దుఃఖాల
సాగలమని నా దేహానికి కష్టాన్ని
నేర్పకపోతే నే బతికున్న జీవచ్చవమని
శివయ్యా…ఓనా…. శివయ్యా…
-దేరంగుల భైరవ
🙏🙏🙏🙏💐💐