విధిరాత
ఉదయం నుంచి వర్షం పడుతున్నా,
నా చరవాణిలో సిగ్నల్స్ లేక ,
ఆలనాటి జ్ఞాపకాలను గుర్తు వచ్చి,
మనసుకి గాయం చేసిన జ్ఞాపకాలెన్నో,
ఎప్పటికి మర్చిపోలేని ఆనందాల పడే
సంఘటనలు ఎన్నో ఉన్నా,
అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ,
నేటి నా చేతిరాతతో వర్ణిస్తూ ఉంటే,
మళ్లీ మళ్లీ నేను ఆ జ్ఞాపకాల్లో మునిగితేలుతూ,
మళ్లీ పాత జ్ఞాపకాల్లో విహరించాలని ,
నా మనసు ఉబలాటపడుతూ,
నేను చేతిరాతలు పిచ్చి రాతలు అనుకున్నా ,
నేను రాసే రాతలికి విలువ ఉండదు అనుకున్నా ,
కానీ దానితోనే నా జీవితం ముడిపడి ఉందని అనుకోలేదు..
ఎలాంటి గమ్యం లేని నా జీవితంలో
అక్షరం అనే గమ్యం ఏర్పరచుకొని ,
నా మీద నాకే నమ్మకం కలిగించేలా చేసింది..
అప్పుడప్పుడు నాలో ఆలనాటి చేదు
జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బాధపెడుతూ ఉంటాయి.
ఇప్పుడు ఆలనాటి జ్ఞాపకాలు మర్చిపోయి
నేను రాసే రాతలు నా జీవితాన్ని మార్చాయి.
నేను రాసే రాతలు నా విధిరాత అని ఎవరికి తెలియదు.
నేను విధిరాతకు తలవంచి చేతిరాతని
నమ్ముకుని బతుకుతున్నాను.
కానీ విధి రాతను ఎవరు మార్చలేరు..
ప్రతి ఒక్కరు విధిరాతకి కట్టుబడి ఉంటారు..
-మాధవి కాళ్ల