అలనాటి – నేటి రాతలు
నేనైతే అలనాడు బుక్ పెన్ను కానీ పెన్సిల్ కానీ పట్టుకుని బుద్దిగా కుర్చీలో కూర్చుని టేబుల్ పై బుక్ పెట్టుకుని రాసుకునే దాన్ని…
ఒక వేళ కింద కూర్చుని రాసుకోవాల్సి వస్తే కింద బుక్ కి ఒత్తుగా ఇంకో గట్టి బుక్కో పాడో పెట్టుకుని రాసేదాన్ని…
అవన్నీ అలనాటి రాతలు..
ఈ నాటి రాతలేమెా ఫోన్ పట్టుకుని వేలుతో టైప్ చేస్తూ చక చకా రాసేయడమే!
అదీ కూచోని కూడా కాదండి పడుకునే రాస్తాను…
అలా పడుకుని రాస్తారా? అని ఆశ్చర్య పోకండి నాకు నడుము నొప్పి మరి ఏం చేయనూ!
అసలు ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించ లేదు సుమండీ!!
మా నాన్న గారు ఇంక్ పెన్ తో రాసేవారు అప్పట్లో! నేనే ఆ పెన్నులో సిరా నింపి ఇచ్చేదాన్ని సరదాగా! నేనేమెా రిఫిల్ పెన్నులే!
అలనాడు తాళపత్ర గ్రంధాలలో రాసేవారు నెమలి ఈకలతో!!
అది మనం చూడనే లేదు కదా!!
ఇవండీ! నేను చూసిన రాసిన అలనాటి ఇలనాటి రాతలండీ!!
-ఉమాదేవి ఎర్రం